|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Samantha: డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.. ఆ ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిందా?

Published: 14-05-2025, 8:29 AM
Samantha: డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.. ఆ ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిందా?

సమంత తన నిర్మాణంలో వచ్చిన ‘శుభం’ సినిమా ప్రీమియర్‌కు హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కూడా కనిపించడంతో వారి డేటింగ్ రూమర్స్ మళ్ళీ తెరపైకి వచ్చాయి.

Key Points

1

సమంత తన నిర్మాణం 'శుభం' సినిమా ప్రీమియర్‌కు రాజ్‌ నిడిమోరుతో కలిసి హాజరైంది.

2

వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4

నెటిజన్లు వీరి రిలేషన్‌షిప్ గురించి ఉత్సుకత వ్యక్తం చేస్తున్నారు.

శుభం సినిమా ప్రీమియర్‌లో సమంత, రాజ్ నిడిమోరు

సమంత ఇటీవల నిర్మాతగా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన సొంత బ్యానర్‌లో నిర్మించిన శుభం మూవీతో నిర్మాతగా మారిపోయింది. మే 9న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను సామ్ ఎంజాయ్ చేస్తోంది. హీరోయిన్‌గా మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా తనకు ఎదురలేదని చెబుతోంది సమంత. అయితే తాజాగా శుభం సినిమా వీక్షించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆ ఫోటోల్లో బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరు కూడా సామ్‌తో పాటే ఉన్నారు. శుభం వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

అయితే గత కొద్దికాలంగా సమంతపై డేటింగ్ రూమర్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య రెండో పెళ్లి తర్వాత ఆ వార్తలు మరింత ఊపందుకున్నాయి. దీనికి కారణం సిటాడెల్‌ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరు. అతనితో ఇప్పటికే సమంత చాలాసార్లు పలు వేదికలపై జంటగా కనిపించింది. పికిల్ బాల్ లీగ్‌లో వీరిద్దరూ ఒక్కసారిగా వేదికపై మెరిశారు. అప్పుడు కూడా రాజ్‌తో సామ్ డేటింగ్‌లో ఉందని వార్తలొచ్చాయి.

డేటింగ్ రూమర్స్‌కు కారణం ఏమిటి?

తాజాగా మరోసారి శుభం మూవీని సమంత, రాజ్‌ కలిసి వీక్షించిన ఫోటోలు షేర్ చేయడంతో నెట్టింట చర్చ మొదలైంది. అంతేకాకుండా ఈ ఫోటోల్లో విమానంలో రాజ్ భుజాలపై సన్నిహితంగా కనిపిస్తూ పోజులిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోతో రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించారంటూ పోస్టులు పెడుతున్నారు. మరో నెటిజన్స్‌ ఈ జంటకు సామ్రాజ్‌ అనే కొత్త పేరు బాగుంటుందని కామెంట్ చేశాడు. ఏదేమైనా వీరిద్దరు కలిస్తే డేటింగ్‌ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ వీటికి ఫుల్‌స్టాప్‌ పడేలా కనిపించడం లేదు. కాగా. గతంలో తిరుమలకు వెళ్లిన సమయంలోనూ సమంత, రాజ్‌ నిడిమోరు జంటగా కనిపించారు.

సమంత మరియు రాజ్ నిడిమోరు మధ్య ఉన్న సంబంధంపై ఇంకా స్పష్టత రాలేదు. వారిద్దరూ స్పష్టీకరణ ఇచ్చే వరకు డేటింగ్ రూమర్స్ కొనసాగుతాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.