|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Samantha: క్లాస్ అండ్ ఎలిగెంట్ లుక్‌తో సమంత సందడి

Published: 19-04-2026, 10:05 AM
Samantha: క్లాస్ అండ్ ఎలిగెంట్ లుక్‌తో సమంత సందడి

మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయి, మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఇమేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి తిరుగులేని స్థాయిలో తన కెరీర్‌ను కొనసాగించింది.

తెలుగులో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అనుభవించింది. ఇప్పటికీ కూడా సమంత ఇదే జోష్‌లో ముందుకు సాగుతోంది. కెరీర్ అద్భుతమైన దశలో ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. కొంతకాలం పాటు వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది.

కానీ ఆ తర్వాత వీరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని విడిపోయారు. అనంతరం ఈమె దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. ప్రస్తుతం వివాహ జీవితం ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుంది. హీరోయిన్గా ఎంతో గొప్ప గుర్తింపును సాధించిన ఈమె, కొంతకాలం క్రితం నిర్మాతగా కూడా మారింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ మా ఇంటి మహాలక్ష్మి అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీని మరికొంత కాలంలోనే విడుదల చేయనున్నారు. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.

అందులో ఈమె పింక్ కలర్ శారీ కట్టుకొని, గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి, చెవులకు ఇయర్ రింగ్స్, చేతులకు గాజులు ధరించి, చేతిలో పువ్వు పట్టుకొని అందంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఈమె నుదిటిన బొట్టు, మెడలో నెక్లెస్ ఈమె అందాన్ని మరింతగా పెంచాయి. ఈ ఫోటోలలో సమంత క్లాస్ లుక్‌లో కనిపించడంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.