|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Samantha:‘దాచడానికి ఏమీ లేదు.. ఇదే ఉద్దేశ్యంతో మొదలవుతుంది’.. సమంత పోస్ట్ వెనక అర్థమేంటి?

Published: 06-06-2025, 11:44 AM
Samantha:‘దాచడానికి ఏమీ లేదు.. ఇదే ఉద్దేశ్యంతో మొదలవుతుంది’.. సమంత పోస్ట్ వెనక అర్థమేంటి?

తెలుగు సినీ ప్రేక్షకులకు అత్యంత ప్రియమైన నటి సమంత, తన సోషల్ మీడియా ఖాతాలో ఓ రహస్యమైన పోస్ట్ పెట్టింది. ‘దాచడానికి ఏమీ లేదు.. ఇదే ఉద్దేశ్యంతో మొదలవుతుంది’ అని రాసింది. ఈ పోస్ట్ వెనుక అసలు అర్థమేమిటో చూద్దాం.

Key Points

1

సమంత తన సోషల్ మీడియాలో రహస్యమైన పోస్ట్ పెట్టింది.

2

ఈ పోస్ట్ వెనుక అర్థం ఏమిటో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

4

మయోసైటిస్ తర్వాత సమంత తన కెరీర్‌లో కొత్త అధ్యాయం ప్రారంభించింది.

సమంత సోషల్ మీడియా పోస్ట్

సినీ ఇండస్ట్రీలో అండ్ ప్రజల్లో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు సినిమాలు హిట్, ప్లాప్ ఏ టాక్ సొంతం చేసుకున్నా.. ఆల్ సమంత ఫ్యాన్స్‌మే అని చెప్పుకున కుర్రాళ్లతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ అమ్మడు తెలుగులో అనేక సినిమాల్లో నటించి.. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. తన అందం, నటన, అభినయం, అమాయకత్వం, డ్యాన్స్‌తో మెప్పించిందనడంలో అతిశయోక్తిలేదు.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి.. స్టార్ డమ్ సంపాదించుకుంది. ఒక సంవత్సరం మయోసైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ సినిమాల బాట పట్టిన సమంత సినిమాల్లో కాకుండా వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ.. తన సత్తా చాటుతోంది. ఇప్పటికే తను నటించిన సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

పోస్ట్ వెనుక అర్థం ఏమిటి?

ఇటీవలే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాగా శుభం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సమంత క్రేజ్ సినీ పరిశ్రమలో మరింత పెరిగిపోయింది. అటు సామ్ సినిమాల్లో కీలక రోల్స్ పోషిస్తూ.. ఇటు నిర్మాతగా మారి తనలోని ప్రతిభను బయటపెడుతోంది. ఇకపోతే సమంత తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఇది ఉద్దేశ్యంతో ప్రారంభమవుతుంది. దాచడానికి ఏమీ లేదు.. @secret.alchemist’’ అని రాసుకొచ్చింది.

సమంత కెరీర్ ప్రయాణం

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

సమంత పోస్ట్‌తో అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మరిన్ని వివరాలు వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.