
టాలీవుడ్ స్టార్ సమంతకు సంబంధించిన డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో, రాజ్ భార్య శ్యామాలి చేసిన కర్మ గురించిన పోస్ట్ సంచలనం సృష్టించింది.
Key Points
సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్ వార్తలు వైరల్
రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి సోషల్ మీడియా పోస్ట్ సంచలనం
కర్మ గురించి శ్యామాలి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి
సమంత-రాజ్ డేటింగ్ రూమర్స్‌పై స్పష్టత లేదు
సమంత-రాజ్ డేటింగ్ రూమర్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు గతంలో టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి కొద్ది కాలంపాటు ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ‘ఏమాయ చేసావే’ చిత్రం తర్వాత అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి కాపురం ఎక్కువ కాలంపాటు నిలువలేదు. కొద్ది రోజులకే మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక డైవర్స్ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టిన చైతు శోభితతో డేటింగ్ చేసి పెద్దల సమక్షంలో రెండో పెళ్లి చేసుకుని లైఫ్‌ను సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడు. సమంత మాత్రం మయోసైటీస్ కారణంగా పూర్తిగా సినిమాలకు దూరం అయింది. చివరగా ‘ఖుషి’ చిత్రంలో కనిపించిన ఆమె వ్యాధి కారణంగా ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంది. ఇటీవల మయోసైటీస్ నుంచి కోలుకోవడంతో రాజ్, డికేలతో ‘సిటాడెల్: హన్నీ బన్నీ’ (Citadel: Honey Bunny)వెబ్‌సిరీస్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
శ్యామాలి సోషల్ మీడియా పోస్ట్
అలాగే నిర్మాతగా మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ట్రాలాలా పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన ఈ భామ మొదటి చిత్రం ‘శుభం’(shubham)తో విజయం సాధించింది. ప్రస్తుతం సామ్ ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. అయితే ఇటీవల ‘శుభం’ రిలీజ్ సమయంలో ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు చర్చనీయాశంగా మారిన విషయం తెలిసిందే. సమంత రాజ్ నిడిమోరుతో గత కొద్ది కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే డేటింగ్ రూమర్స్‌పై వీరిద్దరు స్పందించి క్లారిటీ ఇవ్వకపోవడంతో రోజు రోజుకు ఈ విషయంపై నెటిజన్లకు నమ్మకం బలపడుతోంది.
నెటిజన్ల చర్చ
ఇదిలా ఉంటే.. తాజాగా, రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి సోషల్ మీడియాలో ఇండైరెక్ట్‌గా పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ‘‘కాలం అన్నింటికీ బయటపెడుతుంది. కర్మ సమాధానం చెబుతుంది. ఈ విశ్వం దీనిని నిశితంగా చూస్తుంటుంది’’ అని రాసి ఉన్న సందేశాన్ని పెట్టింది. అంతేకాకుండా ‘కర్మ, నువ్వు ఏం ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది’’ అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను కూడా జత చేయడం చర్చకు దారితీస్తోంది. అయితే ఆమె సమంత, రాజ్ డేటింగ్ గురించే పెట్టిందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఈ సందేశం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటా? అని ఆలోచనలో పడ్డారు.
రాజ్ నిడిమోరు భార్య చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సమంత, రాజ్ డేటింగ్ వార్తలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కర్మ గురించి ఆమె పోస్ట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


