
టాలీవుడ్ నటి సమంత తన వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాజాగా రాజ్ నిడిమోరుతో ఉన్నట్టు వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది.
Key Points
సమంత రాజ్ నిడిమోరుతో రిలేషన్‌షిప్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.
సామ్ మరియు రాజ్ క్లోజ్‌గా ఉన్న ఫోటోలు షేర్ అవ్వడంతో వార్తలకు బలం చేకూరింది.
సమంత ఒక కోట్ షేర్ చేసి రాజ్ భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
సమంత-రాజ్ నిడిమోరు రిలేషన్‌షిప్ వార్తలు
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత(samantha) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మయోసైటీస్ బారిన పడటంతో మొత్తానికి ఇండస్ట్రీకి దూరం అయి ఆ వ్యాధి నుంచి బయటపడింది. ఆ తర్వాత నిర్మాతగా మారిన ఆమె ట్రాలాలా బ్యానర్ స్థాపించి మొదటి మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ‘శుభం’ (shubham)పేరుతో వచ్చిన ఈ సినిమా మే 9న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. సమంత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది రోజుల నుంచి ‘సీటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) తెరకెక్కించిన డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో సీక్రెట్‌గా రిలేషన్‌లో ఉన్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే సామ్ అతడితో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. సమంత, రాజ్ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.
రాజ్ భార్య స్పందన
ఇక ఈ విషయంపై రాజ్ నిడిమోరు భార్య కూడా పలు పోస్టులు షేర్ చేయడంతో వీరి రిలేషన్‌షిప్‌పై అంతా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. భార్య, పిల్లలు ఉన్నవాడితో సమంత రిలేషన్‌లో ఉండటం ఏంటని అంతా ట్రోల్ చేశారు. ఇక ఇన్నాళ్లకు సమంత రాజ్ నిడిమోరుతో రిలేషన్‌షిప్‌పై ఇండైరెక్ట్‌గా ఓ కొటేషన్ షేర్ చేసి ఆయన భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ వేసింది. ‘‘ఎప్పుడూ నిశ్చబ్దంగా ఒకరిని మెచ్చుకోవద్దు. నేను ఎవరినైనా ఆరాధిస్తే ఖచ్చితంగా నేను వారికి చెబుతాను. మనం మనుషులం చాలా పెళుసుగా ఉంటాము. ప్రజలు ఇక్కడ ఉన్నప్పుడే వారితో కలవడం నేర్చుకోవాలి. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఒకరిని ఆరాధించకండి’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ కొటేషన్ చూసిన నెటిజన్లు రాజ్ భార్యను ఉద్దేశించే పెట్టిందని అంటున్నారు. అలాగే రాజ్‌నిడిమోరును ఆరాధిస్తున్నట్లు ఇండైరెక్ట్‌గా చెప్పిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
సమంత స్ట్రాంగ్ కౌంటర్
A post shared by Samantha (@samantharuthprabhuoffl)
చివరగా, సమంత ఇచ్చిన ప్రతిస్పందన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.


