|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమంత షాకింగ్ పిక్: బెడ్ రూమ్ లో అలా.. వైరల్ ఫోటోతో సంచలనం!

Published: 16-03-2026, 3:35 PM
సమంత షాకింగ్ పిక్: బెడ్ రూమ్ లో అలా.. వైరల్ ఫోటోతో సంచలనం!
  • స‌మంత బెడ్ రూమ్ ఫోటో వైరల్: భ‌ర్త రాజ్ నిడిమోరు ల్యాప్‌టాప్‌తో బిజీ!
  • రెండో పెళ్లి చేసుకున్న సమంత.. ఫ్యామిలీ మ్యాన్‌ దర్శకుడితో బంధం!
  • బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత.. సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేరింగ్?
  • అక్కినేని నాగచైతన్యకు విడాకుల తర్వాత సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న సమంత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి తన బెడ్ రూమ్ ఫోటోను షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ ఫోటోలో ఏం ఉందో చూద్దాం రండి!

సమంత బెడ్ రూమ్ సీక్రెట్స్ లీక్!

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని ఏలుతున్నారు హీరోయిన్ సమంత. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సమంత, బాలీవుడ్ లో కూడా దూసుకు వెళ్తోంది. త్వరలోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా హీరోయిన్ గా సమంత కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత, లైఫ్ ను జాలీగా గడుపుతోంది.

రెండో పెళ్లి చేసుకున్న సమంత లైఫ్ లో కొత్త టర్న్!

ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరును ఇటీవల హీరోయిన్ సమంత ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంది. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సింగిల్ లైఫ్ లీడ్ చేసింది సమంత. ఇక లేటెస్ట్ గా రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తన బెడ్ రూమ్ ఫోటోలు షేర్ చేసింది సమంత. ఇక బెడ్ రూమ్ లో ఆమె భర్త రాజ్ నిడిమోరు వర్క్ మూడులో ఉన్నాడు. లాప్టాప్ ముందు పెట్టుకుని బిజీగా కనిపించాడు. బెడ్రూంలో పడుకోకుండా ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నాడని, రాజ్ నిదిమోరు చాలా హార్డ్ వర్కర్ అని చెప్పే ప్రయత్నంలో భాగంగా సమంత ఈ ఫోటోను షేర్ చేసినట్లు తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్‌తో సమంత బాలీవుడ్ ఎంట్రీ!

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

సమంత తాజా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆమె తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మళ్ళీ కలుద్దాం!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.