
టాలీవుడ్ నటి సమంత నటించిన ‘శుభం’ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. మే 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఇప్పుడు ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు.
Key Points
సమంత నటించిన ‘శుభం’ సినిమా జూన్ 13న జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది.
మే 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
జియో హాట్‌స్టార్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.
శుభం సినిమా ఓటీటీ విడుదల తేదీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మయోసైటీస్ కారణంగా గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. చివరగా ‘ఖుషి’ చిత్రంలో కనిపించింది. ఇక ఇటీవల మళ్లీ నిర్మాతగా మారి ‘శుభం’ (Shubham) చిత్రాన్ని తెరకెక్కించింది. ట్రలాలా పిక్చర్స్ బ్యానర్ స్థాపించిన ఆమె కొత్త జర్నీ స్టార్ట్ చేసింది. అయితే ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి(Harshit Reddy), గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి నటించారు. అలాగే ఇందులో స్టార్ బ్యూటీ సమంత గెస్ట్ రోల్ చేసి ప్రేక్షకులను మరోసారి మంత్రముగ్దులను చేసింది.
అయితే ‘శుభం’ చిత్రం మే 9న థియేటర్స్‌లోకి వచ్చింది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బాగానే రాణించింది. తాజాగా, ‘శుభం’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకోగా.. జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన సమంత అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సమంత గెస్ట్ రోల్
బాక్సాఫీస్ విజయం
చివరగా, ‘శుభం’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ప్రకటించబడింది. సమంత అభిమానులకు ఇది గుడ్ న్యూస్. జూన్ 13 నుండి జియో హాట్‌స్టార్ లో చూడొచ్చు.


