
📌 Key Points
- ఓర్మాక్స్ టాప్ 10 లిస్ట్‌లో సమంత వరుసగా రెండోసారి నెం.1 స్థానం సాధించింది.
- ఆలియా భట్ రెండో స్థానంలో కొనసాగగా, రష్మిక మందన్న మూడో స్థానానికే పరిమితం.
- పెళ్లి, పిల్లల తర్వాత కాజల్ అగర్వాల్ నాలుగో స్థానానికి పడిపోయింది.
- త్రిష ఐదవ స్థానాన్ని నిలబెట్టుకోగా, దీపిక పదుకొణె ఆరో స్థానంలో ఉంది.
ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన టాప్ 10 ఇండియన్ హీరోయిన్ల లిస్ట్‌లో సమంత సంచలనం సృష్టించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నను వెనక్కి నెట్టి సమంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సినిమాలు పెద్దగా లేకున్నా ఆమె నెంబర్ 1 స్థానంలో ఎలా నిలిచిందో ఈ కథనంలో చూద్దాం.
ఓర్మాక్స్ లిస్ట్‌లో సమంత నెం.1 స్థానం వెనుక రహస్యం
ఓర్మాక్స్ లిస్ట్ ప్రకారం టాప్ 10 ఇండియాన్ హీరోయిన్ల లిస్ట్ లో సమంత మొదటిస్థానంలో ఉంది. ఇటు టాలీవుడ్ లో.. అటు బాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతూ.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నను కూడా వెనక్కి నెట్టింది సమంత. వరుసగా రెండోసారి కూడా ఆమెమొదటి స్థానం సంపాదించడం విశేషం. రీసెంట్ గా ఆమె ఫ్యామిలీ మెన్ దర్శకుడు రాజ్ నడిమోరును పెళ్లాడింది. నిర్మాత అవతారం ఎత్తి.. వరుసగా సినిమాలు తెరకెక్కిస్తోంది.
ఇండియన్ టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ లో ఆలియా భట్ సెకండ్ ప్లేస్ ను సాధించింది. వరుసగా టాప్ లో ఉంటూ వస్తోన్న ఆలియా భట్.. ఈరెండు నెలలుగా మాత్రం సెకండ్ ప్లేస్ లో ఉంటోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో పాటు.. బిజినెస్ లో కూడా రాణిస్తోంది. అంతే కాదు ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ లో ఎక్కువగా కనిపనిస్తోంది. మోడల్ గా కూడా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది ఆలియా భట్.
ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న మూడో స్థానానికే పరిమితం అయ్యింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. ఈ లిస్ట్ లో మాత్రం ఆమె మెరుగైన స్థానం సంపాదించలేకపోయింది. ఈమధ్య గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలతో సందడి చేసింది బ్యూటీ.. త్వరలో 2026 లో పాన్ ఇండిమా సినిమాలతో హడావిడి చేయడానికి రెడీ అవుతోంది.
అక్టోబర్ లో టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ లో మూడో ప్లేస్ లో ఉన్న కాజల్ అగర్వాల్.. ఈసారి మాత్రం నాలుగో స్థానానికి పడిపోయింది. పెళ్లి, పిల్లల తరువాత పెద్దగా సినిమాలు చేయడంలేదు కాజల్. బిజినెస్ చూసుకుంటూ.. యాడ్స్ లో ఎక్కవగా నటిస్తోంది. అవకాశం ఉన్నప్పుడు మాత్రం సినిమాల్లో కనిపిస్తోంది.
రష్మిక, ఆలియా భట్‌ల స్థానాలు, వారి ప్రాముఖ్యత
టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ లో త్రిష మాత్రం తన స్థానాన్ని కాపాడుకుంటోంది. 42 ఏళ్ల ఈ హీరోయిన్.. ఇప్పటికీ వరుస సినిమాలతో, వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది. స్టార్ హీరోల సరసన భారీ బడ్డెట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఓర్మాక్స్ లిస్ట్ లో త్రిష 5 వ ప్లేస్ లో కొనసాగుతోంది.
ఈమధ్య కాలంలో సౌత్ మూవీస్ లో ఎక్కువగా కనిపించిన దీపికా పదుకొణె.. టాప్ 10 లిస్ట్ లో 6వ ప్లేస్ లోనే కొనసాగుతోంది. రీసెంట్ గా 8 గంటల పనివేళల విషయంలో హాట్ టాపిక్ గా మారిన దీపికా.. కల్కీ2, స్పిరిట్ సినిమాలలో అవకావాలను వదులుకుంది. ప్రస్తుతం ఓర్మాక్స్ టాప్ 10 హీరోయన్ల లిస్ట్ లో 6 వ స్థానంలో కొనసాగుతోంది.
సౌత్ ఇండియాన్ లేడీ సూపర్ స్టార్ గా నయనతారకు పేరుంది. 40 ఏళ్లు దాటినా.. ఏమాత్రం చెక్కుచెదరని అందంతో నయన్ దూసుకుపోతోంది. వరుసగా సినిమాలు కూడా చేస్తోంది. ప్రస్తుతం చిరంజీవి జంటగా మన శంకర వరప్రసాదుగారు సినిమాలో నటిస్తోంది. ఈమూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈమూవీతో పాటు బాలకృష్ణ సరసన నాలుగో సారి నటించబోతుందట నయన్. ఓర్మాక్స్ లిస్ట్ లో నయనతార 7 వ ప్లేస్ లో కొనసాగుతోంది.
కాజల్, త్రిష, దీపిక స్థానాలు.. పడిపోయినవారు ఎవరు?
అక్టోబర్ లో టాప్ 7 గా ఉన్న సాయి పల్లవి.. ఈసారి 8వ ప్లేస్ కు పడిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న రామయణ్ సినిమాలో సీతగా నటిస్తోంది సాయి పల్లవి. ఈసినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్నారు.
కెరీర్ బిగినింగ్ లో వరుస సక్సెస్ లు చూసిన శ్రీలీల.. ప్రస్తుతం వరుస పరాజయాలు ఫేస్ చేస్తోంది. దాంతో ఆమె గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఓర్మాక్స్ టప్ 10 హీరోయిన్ల లిస్ట్ లో ఆమె 9వ ప్లేస్ లో కొనసాగుతోంది.
సినిమాలు ఉన్నా లేకున్నా.. టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది అనుష్క శెట్టి. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాలు చేయడంలేదు. అయినా సరే ఓర్మాక్స్ టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ లో 10 వ స్థానంలో నిలిచింది. గతంలో ఈ ప్లేస్ లో తమన్నా ఉండగా.. తాజాగా ఆమెను పక్కకు నెట్టి.. ఈ ప్లేస్ లో అనుష్క శెట్టి చేరింది.
ఓర్మాక్స్ టాప్ 10 హీరోయిన్ల లిస్ట్‌లో సమంత అగ్రస్థానం కైవసం చేసుకోవడం ఆమె పాపులారిటీకి నిదర్శనం. రష్మిక, ఆలియా వంటివారు కూడా టాప్ స్థానాల్లో ఉన్నా, సమంత సినీ కెరీర్‌కు అతీతంగా తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకుంది. ఈ లిస్ట్ ఎవరు ఎంత ప్రభావం చూపుతున్నారో తెలియజేస్తుంది.


