|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంచలనం! ‘సంబరాల ఏటిగట్టు’ క్లైమాక్స్‌కు 20 కోట్లు: సాయి తేజ్ రిస్క్ చేస్తున్నారా?

Published: 28-02-2026, 6:35 AM
సంచలనం! 'సంబరాల ఏటిగట్టు' క్లైమాక్స్‌కు 20 కోట్లు: సాయి తేజ్ రిస్క్ చేస్తున్నారా?
  • సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం రాయలసీమ నేపధ్యంలో తెరకెక్కుతోంది.
  • క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం నిర్మాతలు భారీగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
  • ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌లో మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని గుర్తు చేసేలా సన్నివేశాలు ఉండబోతున్నాయి.
  • విరూపాక్ష తర్వాత సాయి దుర్గ తేజ్ సోలో హీరోగా వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఎక్కువ ఉన్నాయి.

సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం నిర్మాతలు ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ చిత్రం రాయలసీమ నేపధ్యంలో తెరకెక్కుతోంది.

రాయలసీమ నేపధ్యంలో సాయి తేజ్ చిత్రం

SambaralaYeti Gattu: మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా మెగా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (Sai Durga tej)ఒకరు. సాయిదుర్గ తేజ్ చివరిగా బ్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఈయన సంబరాల ఏటిగట్టు (SambaralaYeti Gattu) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు రోహిత్ కెపి ఇండస్ట్రీకి పరిచయమవుతూ తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రాయలసీమ నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి అసుర ఆగమనం అంటూ ఒక గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిత్ర బృందం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్నారు. అయితే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం నిర్మాతలు భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సంబరాల ఏటిగట్టు సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

క్లైమాక్స్ కోసం 20 కోట్లు ఖర్చు చేస్తున్న నిర్మాతలు

ఈ సినిమా విషయంలో నిర్మాతలు ఎక్కడ వెనకడుగు వేయడం లేదని చెప్పాలి. కేవలం ఒక క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ 35 రోజుల లాంగ్ షెడ్యూల్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నారు. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ లో మొత్తం 18 గ్రాండ్ సెగ్మెంట్స్‌ను ప్లాన్ చేశారు. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని గుర్తు చేసేలా పవర్‌ఫుల్ రిఫరెన్స్ కూడా క్లైమాక్స్‌లో ఉండబోతుందనీ సమాచారం. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం చిత్ర నిర్మాతలు పెద్ద ఎత్తున ప్లాన్స్ చేస్తున్నారని తెలుస్తోంది.

క్లైమాక్స్ కోసం రూ 20 కోట్లు..

సినిమాపై భారీ అంచనాలు

ఇలా ఒక్క ఎపిసోడ్ కోసమే 20 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా విషయంలో చిత్ర నిర్మాతలు పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పాలి . విరూపాక్ష సినిమా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయి దుర్గ తేజ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాలో సాయిదుర్గ తేజ్ జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించగా, అనన్య నాగళ్ళ, జగపతిబాబు వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు చేయడం సాహసోపేతమైన నిర్ణయమే. ఈ సినిమా సాయి దుర్గ తేజ్‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.