
సాయి దుర్గ తేజ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ‘అసుర ఆగమనం’ పేరుతో వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.
Key Points
సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ‘సంబరాల ఏటి గట్టు’ గ్లింప్స్ విడుదల.
‘అసుర ఆగమనం’ పేరుతో వచ్చిన గ్లింప్స్ పై భారీ అంచనాలు.
రోహిత్ దర్శకత్వంలో భారీ పీరియాడిక్ యాక్షన్ గా సినిమా తెరకెక్కుతోంది.
పాన్ ఇండియన్ లెవెల్‌లో ఐదు భాషల్లో సినిమా రిలీజ్ ప్లాన్.
సాయి దుర్గ తేజ్ బర్త్ డే స్పెషల్
Sambarala Yeti Gattu : సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా తెరకెక్కుతున్న సినిమా సంబరాల ఏటి గట్టు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రోహిత్ దర్శకత్వంలో ఈ సినిమా భారీగా పీరియాడిక్ యాక్షన్ గా తెరకెక్కుతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాయి తేజ్ ఫొటోస్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం సాయి తేజ్ మంచి బాడీ బిల్డ్ చేసుకున్నాడు.(Sambarala Yeti Gattu)
నేడు సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు కావడంతో సంబరాల ఏటి గట్టు సినిమా నుంచి అసుర ఆగమనం అంటూ ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ గ్లింప్స్ చూసేయండి..
‘అసుర ఆగమనం’ గ్లింప్స్ అంచనాలు
పాన్ ఇండియా స్థాయి విడుదల
ఈ టీజర్ చూస్తుంటే ఇదేదో కెజిఎఫ్ సెటప్ లా కనిపిస్తుంది. సాంకేతికంగా అయితే సినిమా అదిరిపోతుంది తెలుస్తుంది. చూడాలి మరి సినిమా ఎలా ఉంటుందో. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో సంబరాల ఏటి గట్టుని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి, సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ గ్లింప్స్ సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.


