|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఆ పార్ట్ కి కూడా మేకప్ వెయ్యమన్నారు! ఎన్టీఆర్ హీరోయిన్ సంచలన ఆరోపణలు!

Published: 11-03-2026, 3:35 AM
షాకింగ్: ఆ పార్ట్ కి కూడా మేకప్ వెయ్యమన్నారు! ఎన్టీఆర్ హీరోయిన్ సంచలన ఆరోపణలు!
  • సమీరా రెడ్డి తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి మాట్లాడారు.
  • రంగు తక్కువగా ఉందని తన శరీరంపై కూడా మేకప్ వేయించేవారని ఆమె అన్నారు.
  • పెళ్లి తర్వాత బరువు పెరగడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయానని సమీరా రెడ్డి తెలిపారు.
  • సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ కామెంట్స్ తనను ఏమీ చేయలేవని ఆమె ధైర్యంగా చెప్పారు.

ఒకప్పుడు ఎన్టీఆర్ సరసన నటించిన సమీరా రెడ్డి టాలీవుడ్ లో తనకున్న చేదు అనుభవాలను బయటపెట్టింది. తన రంగు గురించి, శరీరం గురించి జరిగిన విమర్శలను ఆమె ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.

సమీరా రెడ్డి కెరీర్ లో సవాళ్లు

Tollywood:సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలి అంటే కొన్ని విషయాలలో కచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిందే అని కొంతమంది హీరోయిన్స్ చెబుతుంటే.. మరికొంతమంది అలాంటి వాటికి కాంప్రమైజ్ కాలేక ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత నిర్మొహమాటంగా తమకు ఎదురైన చేదు అనుభవాలను బహిరంగంగా చెబుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఎన్టీఆర్(NTR ) తో అశోక్, నరసింహుడు వంటి చిత్రాలు చేసి మంచి పేరు సంపాదించుకున్న సమీరారెడ్డి (Sameera Reddy) పెళ్లి చేసుకొని ఇంటికే పరిమితమైంది. కానీ సడన్గా ఈమధ్య మళ్ళీ ఒక సినిమా అవార్డు వేడుకలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. బాగా బరువు పెరిగిపోయిన ఈమె.. కసరత్తుల చేస్తూ బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే సినిమా పరిశ్రమలో ఉన్న కలర్ డిస్క్రిమినేషన్ తోపాటు బాడీ షేమింగ్ పై నటి సమీరారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి.. తాజాగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ” నన్ను సినిమా పరిశ్రమలో ఉన్న తెల్లతోలు వ్యామోహం ఉన్న కొంతమంది చాలా ఇబ్బంది పెట్టారు. అసలు రంగు కంటే ఇంకా తెల్లగా కనిపించాలని.. ముఖానికే కాకుండా ఎక్కడైతే శరీరం బయటకు కనిపిస్తుందో అక్కడ కూడా మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేసేవారు. అలా వాళ్ళు చెప్పడం వల్ల నేను అందంగా ఉండనేమో అనే భావన నాలో కలిగేది.

బాడీ షేమింగ్ పై సమీరా రెడ్డి ఆవేదన

అలాగే పొట్టిగా ఉండటం వల్ల లావుగా ఉందంటూ విమర్శలు చేశారు. సినీ పరిశ్రమలో టాలెంట్ కన్నా కూడా బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నన్ను మానసికంగా కూడా కలిచివేసింది. ఇక పెళ్లి తర్వాత మొదటి సంతానం కలిగింది. దాంతో పోస్ట్ పార్టమ్ వెయిట్ గైన్ అవ్వడం వల్ల నా ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాను.. ఆ సమయంలో నెటిజన్స్ నుండి ఎదురైన విమర్శలు మానసికంగా నన్ను ఆవేదనకు గురి చేశాయి. ఇక రెండోసారి తల్లి అయినప్పుడు మాత్రం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాను.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతటి దారుణమైన కామెంట్స్ చేసినా.. ఆ నెగిటివ్ కామెంట్స్ చూస్తే నాకేమీ అనిపించడం లేదు. నేను ప్రస్తుతం న్యూట్రల్ గానే ఉన్నాను” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి.

సోషల్ మీడియా ట్రోల్స్ పై సమీరా రెడ్డి స్పందన

హిందీ చిత్రం ద్వారా తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. నరసింహుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జై చిరంజీవ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇక ప్రస్తుతం రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

సమీరా రెడ్డి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ధైర్యంగా చెప్పడం ద్వారా చాలా మందికి స్ఫూర్తినిచ్చారు. ఆమె ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.