
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా ‘జిగ్రీస్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కు హాజరై, చిత్రం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. చిత్ర బృందం చేసిన కష్టాన్ని, సినిమాలోని ప్రత్యేకతలను ఆయన వివరించారు.
Key Points
సందీప్ రెడ్డి వంగా 'జిగ్రీస్' టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.
జిగ్రీస్ చిత్రం బూతులు లేకుండా, ఆధునిక హాస్యంతో తెరకెక్కిందని సందీప్ రెడ్డి ప్రశంసించారు.
సినిమాలోని హార్డ్ వర్క్, ప్రొడక్షన్ సవాళ్లను సందీప్ రెడ్డి వివరించారు.
సందీప్ రెడ్డి 'జిగ్రీస్' సినిమాకు తన మద్దతును ప్రకటించారు.
జిగ్రీస్ టీజర్ లాంచ్ ఈవెంట్
యానిమల్ వంటి సాలిడ్ హిట్ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి. స్పిరిట్ తో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి తాజాగా జిగ్రీస్ టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన జిగ్రీస్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిగ్రీస్ టీజర్ లాంచ్‌లో సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
“ప్రొడ్యూసర్ కృష్ణ వోడపల్లి నాకు ఎల్కేజీ నుంచి స్నేహితుడు. నాకు చెప్తే సినిమా ప్రొడ్యూస్ చెయ్యొద్దు అంటా అని నాకు చెప్పకుండా స్టార్ట్ చేసిండు. యానిమల్ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడే ఒక షెడ్యూల్ అయిపోయింది గోవాలో అని చెప్పాడు. ఇక నేను తిట్టుడు స్టార్ట్ చేసిన ఫోన్లోనే.. ఈ ప్రొడక్షన్ అవి ఎందుకని” అని సందీప్ రెడ్డి వంగా అన్నారు.
“నేను యానిమల్ షూట్ గ్యాప్‌లో హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్ని విజువల్స్ చూపించాడు. చాలా బాగున్నాయి, కొన్ని సీన్లు చూసిన కామెడీ చాలా బాగుంది. ఈరోజుల్లో కాన్‌టెంపరరీ కామెడీ బూతులు లేకుండా చాలా బాగా రాసిండు, తీసిండు డైరెక్టర్ హరీష్” అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.
సందీప్ రెడ్డి వంగా కామెంట్స్
“మ్యూజిక్ మాత్రం సూపర్. కమ్రాన్ సయ్యద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. విజువల్‌కి చాలా బాగా సూట్ అవుతున్నాయి. నాకు తెలిసి మూడు నాలుగు పాటలు ఉన్నాయి. త్వరలోనే రిలీజ్ అవుతాయి. పాటలకు కూడా మీరందరూ చాలా మంచిగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నా” అని సందీప్ రెడ్డి వంగా చెప్పారు.
“టీజర్‌లో కామెడీకొంచెం తక్కువనే ఉంద. సినిమాలో చాలా ఎక్కువ ఉంటుందనిపిస్తుంది నాకు. మన తెలుగు ఆడియెన్స్‌కి ఒక క్వాలిటీ ఉంది. ప్రొడ్యూసర్‌తో సంబంధం లేదు, డైరెక్టర్‌తో సంబంధం లేదు. సినిమా బాగుంటే బ్లాక్ బస్టర్ చేస్తారు. ఈ చిన్న సినిమాని నిజంగా సపోర్ట్ చేయండి. వీళ్లు మామూలు హార్డ్ వర్క్ చేయలేదు. అందరు చేస్తారు బట్ ఇది వేరే రకమైన హార్డ్ వర్క్ ఇది” అని సందీప్ రెడ్డి వంగా అన్నారు.
“రిలీజ్ అయ్యి హిట్ అయినాక చెప్పుకుంటారు వీళ్లు. గోవాలో వీళ్లు షూట్ చేస్తున్నప్పుడు పోలీసు పట్టుకున్నవి, మహారాష్ట్ర బార్డర్‌లో షూట్ చేస్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నవి, అవన్నీ బయటకు వస్తాయి తర్వాత. అవన్నీ విన్నాక అర్థమవుతుంది అసలు ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నారు అని. సో ఎగ్జాట్లీ సక్సెస్ మీట్‌లో మాట్లాడుకుందాం మళ్లీ. సో గుడ్ లక్ టు ఆల్ ద జిగ్రీస్” అని సందీప్ రెడ్డి వంగా చెప్పారు.
జిగ్రీస్ సినిమా ప్రత్యేకతలు
“ఎవరెవరివో సినిమాలు చూస్తున్నారు కదా. వీళ్లు మన తెలుగోళ్లే. హీరోలందరూ వచ్చి చూడండి. కృష్ణ తోటి వినయ్ కూడా కో ప్రొడ్యూసర్. అతను కూడా కొత్తోడే. త్వరలో రిలీజ్ చేస్తున్నారు. మీ జిగ్రీస్‌తో పాటు వచ్చి చూడండి” అని సందీప్ రెడ్డి వంగా తన స్పీచ్ ముగించారు.
కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న జిగ్రీస్ సినిమాకు హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మించగా.. బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తోంది.
సుమారుగా, సందీప్ రెడ్డి వంగా ‘జిగ్రీస్’ చిత్రాన్ని ప్రశంసించి, దాని హార్డ్ వర్క్ ని ప్రత్యేకంగా ఎత్తి చూపారు. సినిమా విజయం కోసం తన ఆశీస్సులు తెలిపారు.


