
తెలుగు సినిమా రంగంలో సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకమైన దర్శకుడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న వారు త్వరలోనే ఒక పొలిటికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ ఉన్నాయి.
Key Points
సందీప్ రెడ్డి వంగా తదుపరి చిత్రం ఒక పొలిటికల్ థ్రిల్లర్.
మూడు గంటల పాటు ఆకట్టుకునే కథాంశం.
ప్రభాస్ తో వస్తున్న 'స్పిరిట్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
సందీప్ రెడ్డి వంగా – పొలిటికల్ థ్రిల్లర్
తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ తో తెరకెక్కించిన బోల్డ్ లవ్ రొమాంటిక్ డ్రామా చిత్రం విజయ్ దేవరకొండ విడుదలకు ముందు ఎన్ని విమర్శలు ఎదుర్కొన్న రిలీజ్ అయ్యాక అంతకుమించిన ప్రశంసలు పొందింది.
దాంతో దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో కూడా సాలిడ్ హిట్ అందుకున్నారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా మూవీ వస్తోందనే అనౌన్స్‌మెంట్‌తోనే అంచనాలు పెంచింది యానిమల్.
ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మాస్ ఆడియెన్స్‌ను అమితంగా కట్టిపడేసింది యానిమల్ మూవీ. కొన్ని వర్గాల నుంచి యానిమల్ మూవీపై విమర్శలు వచ్చిన సందీప్ రెడ్డి వంగా టేకింగ్, డైలాగ్స్, మ్యూజిక్ టేస్ట్‌పై ప్రశంసలు కురిశాయి. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో మూడు గంటల పాటు సీట్‌లో కూర్చొబెట్టారు సందీప్ రెడ్డి వంగా.
మూడు గంటల నిండు వినోదం
ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు. సందీప్ రెడ్డి వంగా తన స్టైల్‌లో ప్రభాస్‌ను పవర్‌ఫుల్ పోలీస్‌గా ఎలా చూపిస్తాడో అని అటు డార్లింగ్ ఇటు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పటివరకు లవ్- రొమాంటిక్, ఫ్యామిలీ-యాక్షన్ డ్రామాల సినిమాలను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగాకు ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ చేయాలని తెగ కోరికగా ఉందట. ఈ విషయాన్ని అర్జున్ రెడ్డి మూవీ ప్రమోషన్స్ టైమ్‌లో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా సందీప్ రెడ్డి వంగానే చెప్పారు.
“మన దగ్గర (తెలుగు రాష్ట్రాల్లో) మూడు టాపిక్‌లు బాగా మాట్లాడుతారు. సినిమా, స్పోర్ట్స్, రాజకీయాలు. ఈ మూడింటిపై ప్రజలకు అమితమైన నాలెడ్జ్ ఉంది. ఈ మూడింటిని బాగా చూపించగలిగే సినిమా తీస్తే వాళ్లు థియేటర్‌కు వచ్చి చూస్తారు. కచ్చితంగా వాళ్లు దాన్ని అమితంగా ఇష్టపడతారు” అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.
పాటలు లేని సినిమా
“ఒక్క పాట లేకుండా సీరియస్ పొలిటికల్ డ్రామా మూడు గంటలు చూపించిన చూస్తారు. అది నా గట్ ఫీలింగ్” అని సందీప్ రెడ్డి వంగా చాలా నమ్మకంగా చెప్పారు. దానికి యాంకర్ కూడా “అవును” అని సమాధానం ఇచ్చారు.
“నాకు అలాంటి స్టోరీ రాయాలని ఉంది. కచ్చితంగా రాస్తాను. కానీ, ఎప్పడు అని నేను చెప్పలేను. కానీ, రాయలని ఉంది” అని ఆ ఇంటర్వ్యూలో సంతోషంగా చెప్పారు సందీప్ రెడ్డి వంగా.
ఈ మాటలను బట్టి ఎప్పుడో కానీ ఒక్క పాట లేకుండా మూడు గంటల రన్‌టైమ్‌తో సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తారని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి ప్రమోషన్స్ సమయంలోని ఈ వీడియో, సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ ప్రస్తుతం యూట్యూబ్ , సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సందీప్ రెడ్డి వంగా తన ప్రత్యేకమైన దర్శకత్వంతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా పట్ల అభిమానుల ఆసక్తి అధికంగా ఉంది.


