|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తొలి ప్రేమ అంత తోపేం కాదు.. ఈ సినిమా ఫస్ట్ లవ్ గురించి కాదు.. సరైన లవ్ స్టోరీ గురించి.. సందీప్ రెడ్డి వంగ ట్వీట్ వైరల్

Published: 02-06-2025, 10:51 AM
తొలి ప్రేమ అంత తోపేం కాదు.. ఈ సినిమా ఫస్ట్ లవ్ గురించి కాదు.. సరైన లవ్ స్టోరీ గురించి.. సందీప్ రెడ్డి వంగ ట్వీట్ వైరల్

ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తాజాగా ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా గ్లింప్స్‌ను ప్రశంసించారు. తన ట్వీట్ వైరల్ అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ లవ్ కాదు, సరైన లవ్ స్టోరీ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Key Points

1

సందీప్ రెడ్డి వంగ 'చెన్నై లవ్ స్టోరీ' గ్లింప్స్‌ను ప్రశంసించారు.

2

ఈ సినిమా 'ఫస్ట్ లవ్' కాదు, 'రైట్ లవ్' గురించి అని సందీప్ పేర్కొన్నారు.

4

సందీప్ రెడ్డి వంగ ట్వీట్ వైరల్‌గా మారింది.

సందీప్ రెడ్డి వంగ ప్రశంసలు

సందీప్ రెడ్డి వంగ సినిమా లవర్. కల్ట్ మూవీస్ లోడ్ చేసే సత్తా ఉన్న దర్శకుడు. జస్ట్ రెండు సినిమాలతోనే విమర్శకుల నోరు మూయించిన డైరెక్టర్. అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్‌తో తానేంటో నిరూపించిన సందీప్.. ప్రభాస్‌తో చేయబోతున్న స్పిరిట్‌తో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇన్ని రోజులు ఈ సినిమా వివాదం గురించి ట్వీట్స్ వేసిన ఈ దర్శకుడు.. తాజాగా మరో సినిమా గ్లింప్స్ గురించి పోస్ట్ పెట్టాడు. ప్రశంసలు కురిపించాడు. ‘‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫస్ట్ లవ్ గురించి కాదు రైట్ లవ్ స్టోరీ గురించి.. టైటిల్, ఫిల్మ్ కాన్సెప్ట్ నచ్చింది. ప్రేమ నిజంగానే అన్ఎక్స్‌పెక్టెడ్ వేస్‌లో మన దగ్గరకు చేరుతుంది’ అంటూ మూవీ టీంకు బెస్ట్ విషెస్ చెప్పాడు.

‘చెన్నై లవ్ స్టోరీ’ గ్లింప్స్

బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, కిరణ్ అబ్బవరం కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రానికి ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేస్తూనే.. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే అందరి కథలూ తల్లి ప్రేమ దగ్గరే ఆగిపోవాలి కదండీ.. అమ్మే కదండీ.. మనందరి ఫస్ట్ లవ్! చరిత్రలో ఎన్నో గొప్ప ప్రేమ కథలున్నాయి.. వాళ్లందరికీ అవి మొదటి ప్రేమలైతే కాదు కదా! ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిందంటే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుందని.. ఒకే చోట కదలకుండా కూర్చుంటే కాసేపు తరువాత కాలు కూడా తిమ్మిరెక్కుద్ది! మనసు కూడా అంతేనండీ.. ఒక్కసారి కదిపి చూడండి.. మెల్లగా అడుగులేస్తూ అదే పరిగెడుతుంది.. అంతేగానీ…వాడెవడోజజ తొలిప్రేమ, నా సమాధి, బొచ్చూ బోషాణం అంటే.. దాన్ని పట్టుకొని కూర్చుంటారేంటండి? అలా అయితే నేనూ చాలా చెప్తా.. ఏమని?? ‘‘తొలిప్రేమ అంత తోపేం కాదని’’’ అంటూ సాగిన హీరో హీరోయిన్ల కన్వర్జేషన్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి మూవీ గ్లింప్స్ ఆకట్టుకోగా.. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్నారు మూవీ లవర్స్.

వైరల్ ట్వీట్

#ChennaiLoveStory – This story is not about First love. It’s about the Right one. ❤️ * https://t.co/RFPB6eUXKs Loved the title and concept of the film. Love truly comes in unexpected ways. Best wishes to the whole team 👍🏻 @Kiran_Abbavaram @srigouripriya #SaiRajesh @SKNonline …

మొత్తంమీద, సందీప్ రెడ్డి వంగ ప్రశంసలతో ‘చెన్నై లవ్ స్టోరీ’పై అంచనాలు పెరిగాయి. సినిమా విజయవంతం కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.