
📌 Key Points
- భారీ ప్రేమకథతో సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ & వార్’ మూవీ.. రణబీర్, అలియా, విక్కీ లీడ్ రోల్స్!
- రిపబ్లిక్ డే కానుకగా 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల.. భన్సాలీ మార్క్ విజువల్స్!
- హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ‘లవ్ & వార్’ విడుదల.. భారీ అంచనాలు!
- రాముడిగా రణబీర్.. దీపావళికి ‘రామాయణం’తో రాక.. ఆ తర్వాత ‘లవ్ & వార్’తో సందడి!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న భారీ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇక రికార్డులు షురూ!
భారీ ప్రేమకథతో భన్సాలీ చిత్రం
Sanjay Leela Bhansali : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ నెక్స్ట్ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ మెయిన్ లీడ్స్ లో సంజయ్ లీలా భన్సాలీ భారీ ప్రేమకథాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లవ్ & వార్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
తాజాగా ఈ భారీ ప్రేమకథ సినిమా ‘లవ్ అండ్ వార్’ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. వచ్చే సంవత్సరం 2027 రిపబ్లిక్ డేకి కానుకగా ముందు వీకెండ్ జనవరి 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎప్పట్లాగే భన్సాలీ మార్క్ అద్భుతమైన విజువల్స్, భారీ సెట్టింగ్స్, ఎమోషన్స్ తో ఈ సినిమా రూపొందుతోంది. లవ్ & వార్ సినిమా కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మారి భన్సాలీ మరోసారి తన మార్క్ లవ్ స్టోరీతో ఎలా మెప్పిస్తారో చూడాలి.
రణబీర్ రాముడిగా.. ఆ తరువాత ప్రేమికుడిగా!
ఇక రణబీర్ ఈ సంవత్సరం దీపావళికి రామాయణ సినిమాతో రాముడిగా కనిపించబోతున్నాడు. అది అవ్వగానే లవ్ & వార్ తో రాబోతున్నాడు.
సంజయ్ లీలా భన్సాలీ మార్క్ లవ్ స్టోరీతో రణబీర్ కపూర్ మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


