|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్‌లో సంజనా గల్రానీని శ్రీకాంత్ ఎలా ఎలిమినేట్ చేశారు? ఊహించని ట్విస్ట్!

Published: 21-12-2025, 10:44 AM
బిగ్ బాస్‌లో సంజనా గల్రానీని శ్రీకాంత్ ఎలా ఎలిమినేట్ చేశారు? ఊహించని ట్విస్ట్!
  • బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలేలో సంజనాని శ్రీకాంత్ ఎలిమినేట్ చేశారు.
  • టాప్ 5లో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యత శ్రీకాంత్‌కు నాగార్జున అప్పగించారు.
  • సంజనాతో ‘దుశ్శాసన’ సినిమాలో నటించినట్లు శ్రీకాంత్ వెల్లడించారు.
  • వైట్ షర్ట్స్, బ్యాండ్ మేళంతో ఎలిమినేషన్ ప్రక్రియలో ట్విస్ట్ ఇచ్చారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేలో ఊహించని ట్విస్ట్! నటుడు శ్రీకాంత్ తన హీరోయిన్ సంజనా గల్రానీని ఎలిమినేట్ చేశారు. నాగార్జున అప్పగించిన ఈ బాధ్యతతో శ్రీకాంత్ చేసిన ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై పూర్తి వివరాలు ఇక్కడ.

శ్రీకాంత్ చేతిలో ఎలిమినేషన్ బాధ్యత

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. తనకి హీరోయిన్ గా నటించిన సంజననే హీరో శ్రీకాంత్ ఎలిమినేట్ చేశారు. టాప్ 5 లో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతని నాగార్జున శ్రీకాంత్ కి అప్పగించారు. తాను బిగ్ బాస్ షోకి పెద్ద అభిమానిని అని ప్రతి ఎపిసోడ్ చూస్తానని శ్రీకాంత్ అన్నారు. నాగార్జున అప్పగించిన బాధ్యత ప్రకారం టాప్ 5లో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు శ్రీకాంత్ హౌస్ లోకి వెళ్లారు.

టాప్ 5 లో ఉన్న ఒక్కొక్కరి గురించి శ్రీకాంత్ ఎంతో అద్భుతంగా మాట్లాడారు. తనూజ తెలుగింటి అమ్మాయిలా ఉందని, ఆమె ఎమోషన్స్ చాలా జెన్యూన్ గా ఉన్నాయని అన్నారు. కామనర్స్ గా వచ్చిన డిమాన్ పవన్, కళ్యాణ్ ఇద్దరూ సెలెబ్రిటీలు అయిపోయారని ప్రశంసించారు. ఇక సంజనతో తాను దుశ్శాసన అనే చిత్రంలో నటించానని.. ఎవ్వరితోనూ మాట్లేడేది కాదు. చాలా సైలెంట్ గా ఉండే అమ్మాయి. అలాంటి అమ్మాయి బిగ్ బాస్ షోకి వెళుతుందని తెలిసి షాక్ అయ్యా.

కంటెస్టెంట్లపై శ్రీకాంత్ ప్రశంసలు

ఆమె తప్పకుండా 2 వారం లేదా మూడో వారంలో బయటకి వచ్చేస్తుంది అని అనుకున్నా. కానీ టాప్ 5 వరకు రావడం షాకింగ్ అని శ్రీకాంత్ అన్నారు. అదే విదాంగా ఇమ్మాన్యుయేల్ కామెడీని బాగా ఎంజాయ్ చేసినట్లు శ్రీకాంత్ తెలిపారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. టాప్ 5 అందరికీ వైట్ షర్ట్స్ ఇచ్చి వేసుకోమని చెప్పారు.

సంజనాని ఎలిమినేట్ చేసిన తీరు

ఆ షర్ట్స్ పై ఎవరు సేఫ్ అయితే వాళ్లకు సేఫ్ అని, ఎలిమినేట్ అయిన వాళ్ళకి ఎలిమినేట్ అని రాస్తానని చెప్పారు. కానీ అందరినీ టెన్షన్ పెట్టి ట్విస్ట్ ఇచ్చారు. అందరికీ సేఫ్ అనే రాశారు. తర్వాత వారిని గార్డెన్ వద్దకు తీసుకుని వెళ్లారు. బ్యాండ్ మేళం తో కొందరు వచ్చారు. అప్పుడే సంజన ఎలిమినేట్ అయినట్లు రివీల్ చేశారు. ఆ విధంగా తనకి హీరోయిన్ గా నటించిన సంజననే శ్రీకాంత్ ఎలిమినేట్ చేయడం విశేషం.

బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలేలో శ్రీకాంత్ చేతిలో సంజనా గల్రానీ ఎలిమినేషన్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన హీరోయిన్‌నే ఎలిమినేట్ చేయాల్సి రావడం, దానికి ఇచ్చిన ట్విస్ట్ షోకు మరింత ఉత్సాహాన్ని తెచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.