
తెలుగులో మరో కొత్త కామెడీ డ్రామా “సంతాన ప్రాప్తిరస్తు” నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఫన్నీ డైలాగులు, ఎమోషనల్ సన్నివేశాలతో నిండిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
Key Points
నవంబర్ 6న విడుదలైన 'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్ చాలా ఫన్నీగా, ఎమోషనల్ గా ఉంది.
చాందినీ చౌదరి, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ కామెడీ డ్రామా నవంబర్ 14న విడుదల.
తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్, అభినవ్ గోమటం తమ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు.
పిల్లల కోసం ప్రేమ వివాహం చేసుకున్న జంట పడే తాపత్రయం ప్రధాన కథాంశం.
సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ హైలైట్స్
తెలుగులో మరో కామెడీ డ్రామా వస్తోంది. వచ్చే వారం థియేటర్లలోకి రానున్న సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ ను గురువారం (నవంబర్ 6) రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా ఫన్నీగా, అదే సమయంలో ఎమోషనల్ గానూ సాగింది.
చాందినీ చౌదరి, విక్రాంత్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం (నవంబర్ 6) మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా ఫన్నీగా సాగిపోయింది. తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్, అభినవ్ గోమటంలాంటి వాళ్లు తమ కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు.
సినిమా కథాంశం, నటీనటులు
సంతాన ప్రాస్తిరస్తు ట్రైలర్
ఈ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. దేవర స్టోరీ ప్రకాష్ రాజ్ చెబితే వినలేదా.. వినే యాంకర్ ఉంటే వేణుస్వామి కూడా ఇంత చెప్పాడంట అనే డైలాగులతో అభినవ్ గోమటం ట్రైలర్ మొదట్లోనే అదరగొట్టాడు. సగానికిపైగా ఫన్నీగా సాగిపోయిన ట్రైలర్.. చివర్లో కాస్త భావోద్వేగానికి గురి చేసింది.
నవ్వులు, భావోద్వేగాల మేళవింపు
పెద్దలను కాదని, ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట పిల్లల కోసం పడే తాపత్రయాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటంతో ఆ జంటకు పిల్లలు పుట్టడం కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఆ జంట ఏం చేసింది? ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఈ సంతాన ప్రాప్తిరస్తు మూవీలో చూడొచ్చు.
సంతాన ప్రాప్తిరస్తు మూవీ గురించి..
“సంతాన ప్రాప్తిరస్తు” ట్రైలర్ సినిమా కథాంశంపై మంచి ఉత్సుకతను రేకెత్తించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట పిల్లల కోసం చేసే ప్రయత్నం, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్ కామెడీతో నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.


