|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అలాంటి వాళ్లకు ఈ మూవీ చూశాక ధైర్యం వస్తుంది.. ‘సంతాన ప్రాప్తిరస్తు’పై మరింత హైప్ పెంచేస్తున్న నిర్మాతలు

Published: 10-11-2025, 2:14 PM
అలాంటి వాళ్లకు ఈ మూవీ చూశాక ధైర్యం వస్తుంది.. ‘సంతాన ప్రాప్తిరస్తు’పై మరింత హైప్ పెంచేస్తున్న నిర్మాతలు

విక్రాంత్, చాందినీ చౌదరి నటించిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ అక్టోబర్ 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సినిమా విశేషాలు వెల్లడించారు. ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడేవారికి ధైర్యం కల్పించే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది అని తెలిపారు.

Key Points

1

'సంతాన ప్రాప్తిరస్తు' చిత్రం అక్టోబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది.

2

ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడేవారికి ఈ సినిమా ధైర్యాన్నిస్తుందని నిర్మాతలు తెలిపారు.

4

సామాజిక సందేశంతో కూడిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని ప్రచారం చేస్తున్నారు.

‘సంతాన ప్రాప్తిరస్తు’ విడుదల వివరాలు, హైలైట్స్

విక్రాంత్, చాందినీ చౌదరి కాంబినేషన్‌లో వస్తున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి. మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సంతాన ప్రాప్తిరస్తు స్క్రిప్ట్‌ను కొందరు పేరున్న హీరోలకు చెప్పాం. హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఈ అంశం వల్ల వాళ్లు ఇమేజ్‌కు ఇబ్బంది అవుతుందని మూవీ చేయలేదు. బాలీవుడ్‌లో ఆయుశ్మాన్ ఖురానా ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూ స్టార్‌గా ఎదిగాడు. మనవాళ్లు కూడా ఆయనలా ప్రయత్నించవచ్చు. ఆ తర్వాత కొత్త అబ్బాయితో వెళ్దాం ఎలాంటి ఇమేజ్ ఇబ్బందులు ఉండవని విక్రాంత్‌ను తీసుకున్నాం.

ఫెర్టిలిటీ సమస్యలపై ధైర్యం: నిర్మాతల మాటలు

మేల్ ఫెర్టిలిటీ సమస్య నేపథ్యంగా సినిమా ఉన్నా, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఎంటర్‌టైనింగ్‌గా సినిమా ఉంటుంది. కామెడీ ఎక్కడా కావాలని ఇరికించినట్లు ఉండదు. చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది. ఇప్పటి ట్రెండ్ ఎంటర్‌టైన్మెంట్ ఎలా ఉంటుందో అలాంటి ఫన్ క్రియేట్ చేశాం. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్.. ఇలా కాస్టింగ్ అంతా మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తారు. స్క్రిప్ట్ వరకే నేను ఇన్వాల్వ్ అయ్యాను. డైరెక్షన్ మొత్తం సంజీవ్ చూసుకున్నాడు. మంచి లవ్ స్టోరీ, ఎమోషన్ ఉన్న క్లీన్ ఎంటర్‌టైనింగ్ మూవీ మాది. సామజవరగమన తర్వాత మళ్లీ తెలుగులో వస్తున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమా చూశాక ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్న వారికి ఒక ధైర్యం వస్తుంది. మంచి మెసేజ్ చేరుతుంది. మనం ఈ సమస్య కోసమా ఇంత బాధపడింది అనుకుంటారు. కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటోంది’ అని తెలిపారు.

వినోదం, సందేశం కలగలిపిన కుటుంబ చిత్రం

నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాతో నిర్మాతగా మీ ముందుకు రావడం హ్యాపీగా ఉంది. పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లు… మా సినిమా పేరుకే చిన్నది కానీ ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తుంది. ఎక్కువమందికి రీచ్ అవుతుంది. మా లాంటి చిన్న మూవీస్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు, హానెస్ట్‌గా అటెంప్ట్ చేసే మూవీస్‌కు మీడియా మిత్రుల నుంచి ఇంకాస్త సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తున్నాం. మీరు ఆదరిస్తే మరిన్ని ఇలాంటి మంచి చిత్రాలు చేసే హోప్ వస్తుంది. ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లో కొత్త వాళ్లను ప్రోత్సహించేందుకు త్వరలో డెబ్యూ అవార్డ్స్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నా. చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్‌కు మావంతు ప్రోత్సాహం అందించాలని అనుకుంటున్నాం’ అని అన్నారు.

‘సంతాన ప్రాప్తిరస్తు’ కేవలం ఒక వినోదాత్మక చిత్రం మాత్రమే కాదు, ఒక సామాజిక సందేశాన్ని కూడా అందిస్తుంది. ఫెర్టిలిటీ సమస్యలతో పోరాడుతున్న వారికి ఈ చిత్రం స్ఫూర్తినిస్తుందని, కుటుంబ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.