
📌 Key Points
- సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా రొమాంటిక్ లవ్ స్టోరీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ!
- ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా విడుదల కానున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ!
- యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీగా నిర్మిస్తున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం!
- నెల్లూరు నుంచి వచ్చిన శివగా సంతోష్, చిత్తూరు మిత్రగా మానస సందడి!
సంతోష్ శోభన్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ సన్నివేశాలతో సినిమాపై అంచనాలు పెంచేశారు. మూవీ లవర్స్ కి పండగే.
యూవీ క్రియేషన్స్ లో సంతోష్ మూవీ!
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా నుంచి ట్రైలర్ రానే వచ్చింది. హగ్గులు, ముద్దులతో ఫుల్ రొమాంటిక్‌గా సాగిన ఈ ట్రైలర్ ప్రజెంట్ నెట్టింట సందడి చేస్తుంది. ఇక ఈ ట్రైలర్ ఈవెంట్‌లో హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. ‘యూవీ క్రియేషన్స్ నా ఫ్యామిలీ లాంటిది. ఈ బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమా మాది అనుకుంటాం. డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ చేయబోయే ఎన్నో మంచి చిత్రాల్లో మొదటిదిగా “కపుల్ ఫ్రెండ్లీ” రిలీజ్ కు వస్తోంది. నేను చిన్న గ్యాప్ తీసుకున్న మాట నిజమే. ఈ సారి నేను చూపించబోయే కథ ఇరవై ఏళ్ల పాటు మీకు గుర్తుండిపోవాలి అనుకుని ఈ సినిమా చేశాను. శివ అనే క్యారెక్టర్‌కు ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తా. శివ నెల్లూరు నుంచి వచ్చిన అబ్బాయి, మిత్ర చిత్తూరు నుంచి వస్తుంది. వాళ్లు చెన్నైలో కలుస్తారు. చెన్నైలో షూటింగ్ చేయడం బ్యూటిపుల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. శివ, మిత్ర అనే పాత్రలు మిమ్మల్ని నవ్విస్తాయి, కదిలిస్తాయి. కాస్త ఏడిపిస్తాయి. “కపుల్ ఫ్రెండ్లీ” ఒక జెన్యూన్ ఇంటెన్షన్‌తో హానెస్ట్ గా చేసిన సినిమా. ఇది నా కెరీర్‌లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది’ అన్నారు. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా నిర్మిస్తుండగా.. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
రొమాంటిక్ ట్రైలర్ తో హైప్!
వాలెంటైన్స్ డేకి రిలీజ్!
సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం యూత్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేలా ఉంది. వాలెంటైన్స్ డే కానుకగా వస్తున్న ఈ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


