|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సారా అలీ ఖాన్ సంచలనం! బంగ్లా లీజుకు ఇచ్చి కోట్లు కొల్లగొడుతోందా?

Published: 31-03-2026, 11:05 AM
సారా అలీ ఖాన్ సంచలనం! బంగ్లా లీజుకు ఇచ్చి కోట్లు కొల్లగొడుతోందా?
  • సారా అలీ ఖాన్ బంగ్లాను స్కూల్ కోసం లీజుకు ఇవ్వడంతో భారీగా ఆదాయం!
  • అద్దెకు తీసుకున్న విద్యాసంస్థ నుంచి రూ. 4.14 కోట్ల ఆదాయం ఫిక్స్!
  • సెక్యూరిటీ డిపాజిట్‌గా ఇప్పటికే రూ. 20 లక్షలు చెల్లింపు పూర్తి!
  • మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్.. ఆ తర్వాత అద్దెలో పెరుగుదల!

బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన బంగ్లాను లీజుకు ఇచ్చి భారీగా సంపాదిస్తున్నారు. ఈ డీల్ టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సారా అలీ ఖాన్ భారీ డీల్!

Sara Ali Khan Leases Bungalow For School: బాలీవుడ్ యంగ్ హీరోయిన్, దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ అంధేరీ వెస్ట్‌లోని తన బంగ్లాను ఓ స్కూల్ కోసం లీజుకు ఇచ్చారు. దీంతో ఆమెకు దాదాపుగా రూ. 4.14 కోట్ల ఆదాయం రానుంది. మరి అది ఎలా, నెలకు సారా అలీ ఖాన్‌కు వచ్చే రెంట్ వివరాలపై లుక్కేద్దాం.

బాలీవుడ్ తారలు కేవలం వెండితెరపైనే కాదు, రియల్ ఎస్టేట్ రంగంలోనూ తమ సత్తా చాటుతున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ , దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ముంబైలోని తన ఖరీదైన ఆస్తిని లీజుకు ఇచ్చి భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంధేరీ వెస్ట్‌లోని తన బంగ్లాను ఒక ప్రైవేట్ విద్యా సంస్థకు అద్దెకు సారా ఇచ్చినట్లు ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా వెల్లడైంది.

మొత్తం విలువ: ఐదేళ్ల కాలానికి గాను ఈ లీజు విలువ సుమారు రూ. 4.14 కోట్లు.

ఎంత రెంట్ వస్తుందో తెలుసా?

డిపాజిట్: అద్దెదారు ఇప్పటికే రూ. 20 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించారు.

లాక్-ఇన్ పీరియడ్: ఐదేళ్ల లీజు కాలంలో మూడేళ్ల పాటు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఈ లోపు ఒప్పందాన్ని రద్దు చేయడానికి వీలుండదు.

రియల్ ఎస్టేట్ రంగంలో సారా!

అద్దె పెరుగుదల: మూడవ ఏడాది నుంచి ప్రతి ఏటా అద్దెను 5 శాతం మేర పెంచాలని ఒప్పందంలో పేర్కొన్నారు.

అమలు: ఈ ఒప్పందం మే 1, 2026 నుంచి అమలులోకి రానుంది.

సారా అలీ ఖాన్ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్నారు. ఈ లీజు వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.