|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బోల్డ్ ఓటీటీ తెలుగు వెబ్ సిరీస్‍లో సత్య.. ఐపీఎల్ బెట్టింగ్, ట్రెండింగ్ డైలాగ్‍లతో అదిరిపోయిన టీజర్: చూసేయండి

Published: 27-05-2025, 3:01 AM
బోల్డ్ ఓటీటీ తెలుగు వెబ్ సిరీస్‍లో సత్య.. ఐపీఎల్ బెట్టింగ్, ట్రెండింగ్ డైలాగ్‍లతో అదిరిపోయిన టీజర్: చూసేయండి

పాపులర్ తెలుగు వెబ్ సిరీస్ ‘3 రోజెస్’ రెండో సీజన్ టీజర్ విడుదలైంది. ఈ సీజన్‌లో ప్రముఖ కమెడియన్ సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ట్రెండింగ్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

Key Points

1

ఆహా ఓటీటీలో '3 రోజెస్' సీజన్ 2 త్వరలో రానుంది.

2

కామెడీయన్ సత్య 'బెట్టింగ్ భోగి' పాత్రలో నటిస్తున్నారు.

4

కుషిత కల్లపు, రాశీ సింగ్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ విడుదల

తెలుగు వెబ్ సిరీస్ ‘3 రోజెస్’ ఫస్ట్ సీజన్ మంచి సక్సెస్ సాధించింది. బోల్డ్ సబ్జెక్ట్, సీన్లు, కామెడీతో ఉండే ఈ సిరీస్ 2021లో వచ్చి పాపులర్ అయింది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది. ఈ సీజన్‍కు సంబంధించి ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ వస్తోంది ఆహా ఓటీటీ. కుషిత కల్లపు, రాశీ సింగ్‍లను న్యూ రోజెస్ అంటూ ఇప్పటికే పరిచయం చేసింది. 3 రోజెస్ రెండో సీజన్‍లోకి పాపులర్ కమెడియన్ సత్య కూడా వచ్చేశారు.

3 రోజెస్ సీజన్ 2లో బెట్టింగ్ భోగి క్యారెక్టర్ చేస్తున్నారు సత్య. ఇందుకు సంబంధించి టీజర్‌ను ఆహా ఓటీటీ నేడు (మే 27) తీసుకొచ్చింది. ఐపీఎల్ సీజన్‍లో బెట్టింగ్‍లు వేస్తూ ఉంటాడు బెట్టింగ్ భోగీ (సత్య). ఐపీఎల్, పీఎల్ఎల్ లీగ్‍లపై బెట్‍లు వేస్తూ ఉంటాడు. ముంబై మీద లక్ష వేసుకోని అని భోగి అంటే.. ఎవరూ లేరు ఓడిపోయే మ్యాచ్ అని అవతలి వ్యక్తి అంటాడు. అంపైర్లు ఉన్నారు కదరా అని సత్య చెబుతాడు.

సత్య పాత్ర ప్రత్యేకతలు

బెట్టింగ్ వద్దని ఓ ఆటో డ్రైవర్ చెబుతాడు. బెట్టింగ్ వేసి కారు నుంచి ఆటోకి వచ్చానంటాడు. ఏ ఆర్సీబీ ఫ్యానా అని బెట్టింగ్ భోగీ (సత్య) అంటాడు. ఈ సాలా కప్పు.. లాలీపాప్పు అంటూ బ్యాక్‍గ్రౌండ్ వాయిస్ వస్తుంది. ఇలా సోషల్ మీడియా ట్రెండింగ్ డైలాగ్‍లతో టీజర్ సాగింది.

బెట్టింగ్‍లో డబ్బులు పోగొట్టుకొని ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అడుగుతూ ఉంటాడు బెట్టింగ్ భోగి. రూ.10లక్షలు పోగొట్టుకుంటాడు. ఏదో మ్యాజిక్ చేయాలి అనుకుంటాడు. ‘నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరీర్‌ మీద’ అంటూ అలేఖ్య పచ్చళ్ల కాంట్రావర్సీ డైలాగ్ వినిపిస్తుంది. పోయిన డబ్బుతో ఎకరం కొంటుంటి అంటాడు బెట్టింగ్ భోగి. ఏం చేయలేం బెట్టింగ్ ఆపాలనుకుంటాడు. ఇలా సరదాగా, ట్రెండింగ్ డైలాగ్‍లతో 3 రోజెస్ సీజన్ 2 సత్య టీజర్ ఉంది. సత్య తన కామెడీ టైమింగ్‍తో దుమ్మురేపేశారు.

సిరీస్ విడుదల తేదీ

3 రోజెస్ రెండో సీజన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. త్వరలో స్ట్రీమింగ్ అంటూ ఆహా వెల్లడించింది. ఇంకా తేదీ ఖరారు చేయలేదు. అయితే, జూన్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి.

3 రోజెస్ రెండో సీజన్‍కు కిరణ్ కే కరవళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ మారుతీ క్రియేటర్‌గా ఉన్నారు. ఈ సిరీస్‍కు రవి నంబూరి, సందీప్ బొల్లా కథను అందించారు. ఈ సిరీస్‍ను ఎస్‍కేఎన్ నిర్మించారు. ఈ రెండో సీజన్‍లో కుషిత కల్లపు, రాశీ సింగ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఫస్ట్ సీజన్‍లో నటించిన ఈషా రెబ్బా కూడా కొనసాగనున్నారు.

మొత్తానికి, ‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ అంచనాలను పెంచింది. సత్య కామెడీతో పాటు, ఐపీఎల్ బెట్టింగ్ నేపథ్యం ఆసక్తికరంగా ఉంది. జూన్‌లో విడుదల అయ్యే ఈ సిరీస్‌ను అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.