
విజయ్ దేవరకొండ మరియు సత్యదేవ్ నటించిన ‘కింగ్డమ్’ సినిమా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సినిమా విజయం గురించి సత్యదేవ్ మరియు నిర్మాత నాగవంశీ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Key Points
సత్యదేవ్, విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
సత్యదేవ్ 'కింగ్డమ్' లోని తన పాత్ర, విజయ్ దేవరకొండ తో సహకారం గురించి మాట్లాడారు.
నిర్మాత నాగవంశీ సినిమా యొక్క సాంకేతిక ప్రతిభ, హాలీవుడ్ స్థాయి గురించి ప్రస్తావించారు.
సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది.
‘కింగ్డమ్’ సినిమా విజయం
టాలీవుడ్ వెర్సటైల్ హీరో సత్యదేవ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటంచిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం కింగ్డమ్. జూలై 31న థియేటర్లలో విడుదలైన కింగ్డమ్ మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన కింగ్డమ్ సక్సెస్ ఈవెంట్‌లో హీరో సత్యదేవ్, నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. ” కింగ్‌డమ్ సినిమాకు వస్తున్న స్పందన పట్ల సంతోషంగా ఉంది. సినిమాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. ఈ చిత్రంతో నా సోదరుడు విజయ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విజయ్ గెలిస్తే నేను గెలిచినట్లే” అని అన్నాడు.
“సొంతంగా వచ్చి ఏదో సాధించాలి అనుకునే ఎందరికో విజయ్ దేవరకొండ స్ఫూర్తి. అలాంటి విజయ్ దేవరకొండ గెలవడం ఆనందంగా ఉంది. నాగవంశీ గారు డేరింగ్ ప్రొడ్యూసర్. అందరూ భయపడే సినిమాలను రిస్క్ చేసి తీస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారి ధన్యవాదాలు” అని సత్యదేవ్ తెలిపాడు.
సత్యదేవ్ యొక్క వ్యాఖ్యలు
“డైరెక్టర్ గౌతమ్ ఈ కథ చెప్పగానే కచ్చితంగా ఈ సినిమా చేయాలి అనుకున్నాను. బ్రదర్ సెంటిమెంట్ గురించి, ఆర్టిస్ట్‌ల పర్ఫామెన్స్‌ల గురించి అందరూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. వంశీ గారు అన్నట్టు ఈ సినిమా హాలీవుడ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. కింగ్‌డమ్ ఇచ్చిన ఉత్సాహంతో ప్రేక్షకులకు మరిన్ని మంచి సినిమాలు అందిస్తాను” అని హీరో సత్యదేవ్ చెప్పుకొచ్చాడు.
నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. “మేము అనుకున్నట్టుగానే సినిమాకి మంచి స్పందన వస్తోంది. రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. ఈ మధ్య కాలంలో సాంకేతికంగా ఇంత గొప్పగా ఉన్న సినిమా ఇదే అని మాటలు వినిపిస్తుండటం సంతోషంగా ఉంది” అని అన్నారు.
నిర్మాత నాగవంశీ మాటలు
“ఒక తెలుగు సినిమాని సాంకేతికంగా హాలీవుడ్ స్థాయిలో తీశాము. థియేటర్‌కి వచ్చి సినిమా చూడండి. మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విజయ్ దేవరకొండ గారి అభిమానులు కోరుకున్నట్టు ఈ సినిమాతో ఆయన హిట్ కొట్టడం చాలా ఆనందంగా ఉంది” అని నాగవంశీ తెలిపారు.
” అనిరుధ్ , నవీన్ నూలి సహా అందరూ ఎంతో ఎఫర్ట్ పెట్టి సినిమా కోసం పని చేశారు. మేము మంచి కంటెంట్‌ని అందించాము. దానిని ప్రేక్షకుల్లోకి తీసుకొని వెళ్లడానికి మీడియా ఎంతో సపోర్ట్ చేసింది. సినిమా వసూళ్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. మొదటి రోజే చాలా చోట్ల బిజినెస్ చేసిన దానిలో సగానికి పైగా రాబడుతోంది. మాకు మరో విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు” అని నాగవంశీ పేర్కొన్నారు.
మొత్తంమీద, ‘కింగ్డమ్’ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. సత్యదేవ్ మరియు విజయ్ దేవరకొండల నటనతో పాటు, సినిమా యొక్క సాంకేతిక ప్రతిభ ప్రేక్షకులను ఆకట్టుకుంది.


