
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడులో చేసిన వ్యాఖ్యలపై తమిళ నటుడు సత్యరాజ్ తీవ్ర స్పందన తెలిపారు. తమిళనాడులో పవన్ రాజకీయ జోక్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Key Points
సత్యరాజ్ పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల్లో జోక్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మురుగన్ మానాడు సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సత్యరాజ్ తీవ్రంగా ఖండించారు.
తమిళ ప్రజలను మోసం చేయాలనుకుంటే అది మీ తెలివితక్కువతనమే అని సత్యరాజ్ హెచ్చరించారు.
తమిళనాడులో పవన్ కళ్యాణ్ రాజకీయ ఆటలు సాగవని సత్యరాజ్ స్పష్టం చేశారు.
సత్యరాజ్ నుండి పవన్ కళ్యాణ్ కు హెచ్చరిక
దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తామంటే ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan)కి తమిళ నటుడు సత్యరాజ్(Sathyaraj) వార్నింగ్ ఇచ్చాడు. తమిళనాడులో మురుగన్ మానాడు పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనంలో పవన్ .. నాస్తికులు, సెక్యులరిస్టులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై ఇప్పుడు నటుడు సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మురుగన్ మానాడు వ్యాఖ్యలపై విమర్శలు
మురుగన్ మానాడు పేరుతో తమిళులను మోసం చేశామనుకుంటే… అది మీ తెలివి తక్కువ తనమే అవుతుందని విమర్శించాడు. తమిళ ప్రజలు తెలివైన వారన్న సత్యరాజ్… తమిళనాట మీ ఆటలు సాగబోవని కూడా హెచ్చరించారు. విడుతలై చిరుతైగల్ కచ్చి (వీకేసీ) పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో రాజకీయ జోక్యంపై ఆగ్రహం
కాగా, పవన్ వ్యాఖ్యలను ఇప్పటికే డీఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు తమిళనాడుతో మీకేం సంబంధం’ అని డీఎంకే కీలక నేత, మంత్రి శేఖర్ బాబు పవన్‌ని ప్రశ్నించారు. ‘మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ అంతగా తమిళనాడుపై ప్రేమ ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించు’ అని పవన్‌కి సవాల్ విసిరాడు.
తమిళనాడులో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయత్నాలపై సత్యరాజ్ తీవ్రంగా స్పందించారు. తమిళ ప్రజలను అవమానించే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. ఈ వివాదం తమిళనాడు రాజకీయాలలో కొత్త చర్చను రేకెత్తిస్తోంది.


