|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sekhar Kammula: ‘అతను తప్ప ఎవరూ చేయలేరు’.. శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్

Published: 01-06-2025, 10:56 PM
Sekhar Kammula: 'అతను తప్ప ఎవరూ చేయలేరు'.. శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్

నాగార్జున, ధనుష్ నటించిన కుబేర సినిమా జూన్ 20న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా శేఖర్ కమ్ముల ధనుష్ నటనను అభినందించారు. ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Key Points

1

కుబేర సినిమా జూన్ 20న విడుదల.

2

శేఖర్ కమ్ముల ధనుష్ నటనను ప్రశంసించారు.

4

నాగార్జున ధనుష్ నటనను కొనియాడారు.

కుబేర సినిమా ప్రమోషన్స్

నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.  ఈ మూవీని అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.

శేఖర్ కమ్ముల కామెంట్స్

ఇకపోతే ఈ మూవీ రిలీజ్‌ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్‌ శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్ చేశారు. కోలీవుడ్‌ హీరో ధనుశ్‌పై ప్రశంసలు కురిపించారు.

ధనుష్ నటనపై ప్రశంసలు

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. టఈ సినిమాతో హీరో ధనుష్ మరో జాతీయ అవార్డ్ అందుకుంటారు. ఈ సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంతో మరో జాతీయ అవార్డు గెలుచుకుంటాడని భావిస్తున్నా. అతను తప్ప మరెవరూ ఈ పాత్రలో నటించలేరు” అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.  నాగార్జున మాట్లాడుతూ.. “ధనుష్ ఒక ఇంటర్నేషనల్ యాక్టర్. అతనిలో గొప్ప టాలెంట్ ఉంది. ధనుష్, శేఖర్ కమ్ముల.. మీరిద్దరూ నన్ను మళ్లీ ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు” అంటూ ప్రశ్నించారు.

కుబేర చిత్రం ధనుష్ కెరీర్ లో మరో మైలురాయి అవుతుందని శేఖర్ కమ్ముల, నాగార్జున అభిప్రాయపడ్డారు. జూన్ 20న విడుదలయ్యే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.