|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Selvaraghavan: యుగానికి ఒక్కడు రీ రిలీజ్.. ఇప్పుడు సంబరాలు చేసుకొని ఎం లాభం.. అస్సలు సంతోషంగా లేను..

Published: 26-10-2025, 12:11 AM
Selvaraghavan: యుగానికి ఒక్కడు రీ రిలీజ్.. ఇప్పుడు సంబరాలు చేసుకొని ఎం లాభం.. అస్సలు సంతోషంగా లేను..

కార్తీ నటించిన ‘యుగానికి ఒక్కడు’ సినిమా రీ రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు సెల్వరాఘవన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పట్లో నెగెటివ్ రివ్యూలు వచ్చాయని, ఇప్పుడు సంబరాలు చేసుకొని లాభం లేదని అన్నారు. యుగానికి ఒక్కడు 2 గురించీ మాట్లాడారు.

Key Points

1

కార్తీ హీరోగా వచ్చిన 'యుగానికి ఒక్కడు' సినిమా మార్చి 14న రీ రిలీజ్ కానుంది.

2

దర్శకుడు సెల్వరాఘవన్ రీ రిలీజ్ వేడుకలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

4

యుగానికి ఒక్కడు 2 ప్రాజెక్ట్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

రీ రిలీజ్ వేడుకలపై సెల్వరాఘవన్ అసంతృప్తి

Selvaraghavan: తమిళ స్టార్ కార్తీ హీరోగా వచ్చిన పీరియాడికల్ డ్రామా యుగానికి ఒక్కడు. దర్శకుడు శ్రీరాఘవ తెరకెక్కించిన ఈ సినిమా 2010లో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ, ఈ సినిమా కోసం దర్శకుడు పడిన కష్టానికి మాత్రం ప్రశంసలు దక్కాయి. (Selvaraghavan)అయితే, ఇంతకాలం తరువాత ఇప్పుడు ఈ సినిమా మరోసారి తెరపైకి రానుంది. మార్చి 14న ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా యుగానికి ఒక్కడు సినిమా రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీరాఘవ మాట్లాడుతూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లో డబుల్ ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన పచ్చళ్ళ పాప.. శ్రీజ రీ ఎంట్రీ ఫిక్స్?

యుగానికి ఒక్కడు: తొలి స్పందన, దర్శకుడి బాధ

“యుగానికి ఒక్కడు సినిమా విడుదలైనప్పుడు చాలా నెగెటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. ఆ రివ్యూలు చూసి చాలా బాధేసింది. అప్పటినుంచే నెగెటివిటీని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. ఇంతకాలం తరువాత ఇప్పుడు ‘యుగానికి ఇక్కడ’ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి. ఈ సినిమా కోసం ఎంతో డబ్బు, సమయం వేచ్చించ్చాం. రిలీజ్ టైంలో ఇలా సంబరాలు చేసుకుంటే సంతోషపడేవాడిని” అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

యుగానికి ఒక్కడు 2పై ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక యుగానికి ఒక్కడు 2 గురించి యాంకర్ ప్రశ్నించగా.. “అసలు యుగానికి ఒక్కడు 2 సినిమాను ప్రకటించకుండా ఉండాల్సింది. హీరోగా కార్తీ కాకుండా వేరెవరితో ఈ సినిమా చేయడం. చేయాలంటే కనీసం అతని సంవత్సర కాల్ షీట్స్ కావాలి. బడ్జెట్ కూడా చాలానే అవసరం అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో శ్రీరాఘవ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విరాళ వుతున్నాయి.

సెల్వరాఘవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా విడుదల సమయంలో పడిన కష్టాన్ని, ఇప్పుడు లభించిన గుర్తింపును బట్టి ఆయన భావోద్వేగాలను అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాఖ్యలు అభిమానులలో చర్చకు దారితీశాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.