
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు సూర్యుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి రవి బలం పెరిగి, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అనేక శుభాలు జరుగుతాయి.
Key Points
మేష, కర్కాటక, వృశ్చిక, ధనస్సు రాశుల వారికి రవి బలం.
రుణ విమోచన, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక లాభాలు.
అనారోగ్యం, శత్రు బాధల నుండి ఉపశమనం.
రవి బలం: ఏ రాశులకు శుభ ఫలితాలు?
గ్రహాల సంచారంలో మార్పు రావడంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది మనపై ఎంతగానో ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అయితే గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను ఎదుర్కొంటుంటారు.
సెప్టెంబర్ 17 అంటే రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజులు పాటు సూర్యుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. దీంతో రవి బలం పెరిగే కొన్ని రాశుల వారు రాజయోగంతో సంతోషంగా ఉంటారు. చాలా రకాల సమస్యలు తొలగిపోతాయి.
సూర్యుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి సెప్టెంబర్ 17న ప్రవేశిస్తాడు. దీనితో ప్రధానంగా నాలుగు రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. రవి బలం వలన రాజయోగం పట్టడంతో ఈ రాశుల వారి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మరి ఏ రాశుల వారు ఈ నెల రోజులు పాటు రవి బలంతో సంతోషంగా ఉంటారు? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడే తెలుసుకుందాం.
రేపటి నుంచి నెల రోజులు పాటు రవి బలంతో ఈ రాశుల వారికి బోలెడన్ని లాభాలు
మేష, కర్కాటక, వృశ్చిక, ధనస్సు రాశులకు లాభాలు
మేష రాశి వారికి సూర్యుడు సంచారంలో మార్పు రావడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు రుణ బాధల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యలతో బాధ పడేవారు, శత్రు బాధల వలన ఇబ్బంది పడే వారు కూడా ఉపశమనాన్ని పొందుతారు. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది.
కర్కాటక రాశి వారు కూడా రవి బలంతో చాలా సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశి మూడవ ఇంట్లో రవి సంచరించడంతో శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఈ రాశి వారు అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తవుతాయి. సోదరులతో ఉన్న గొడవలు అన్నీ తీరిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు.
వృశ్చిక రాశి వారు రవి బలంతో కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. వృశ్చిక రాశి వారు గురు బలం లేక, రవి బలం లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ రవి సంచారంతో ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. కెరీర్ లో పురోగతి చూస్తారు. సెప్టెంబర్ 17 తర్వాత ప్రయత్నం చేస్తే కచ్చితంగా మీకు ఉద్యోగం, డబ్బు లాంటివన్నీ పొంది సంతోషంగా ఉండొచ్చు.
సూర్య సంచారం: కన్యా రాశి ప్రభావం
ధనస్సు రాశి వారు ఎక్కువ లాభాలను పొందుతారు. రవి సంచారంలో మార్పుతో పెద్దవారి ఆశీస్సులతో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. చాలా మంచి జరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది. రవి బలంతో మీరు సంతోషంగా ఉంటారు.
మిగిలిన రాశుల వారు రవి బలం లేకపోవడంతో రవి బలాన్ని పొందడానికి ఆదిత్య హృదయం పఠించండి. శివుడిని ఆరాధిస్తే రవి బలం పెరిగి సంతోషంగా ఉండొచ్చు. సక్రమంగా అన్ని పనులు పూర్తవుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సూర్యుని కన్యా రాశి సంచారం వల్ల మేష, కర్కాటక, వృశ్చిక, ధనస్సు రాశుల వారు అనేక శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.


