|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య: పూజ, ఫలితాలు

Published: 09-09-2025, 9:47 PM
సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య: పూజ, ఫలితాలు

భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. సెప్టెంబర్ 21న వచ్చే ఈ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పితృ దేవతలను పూజించి, వారికి తర్పణాలు, శ్రాద్ధాలు చేయడం ద్వారా పితృ ఋణం తీర్చుకోవచ్చు.

Key Points

1

సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య పర్వదినం.

2

పితృదోష నివారణకు తర్పణాలు, శ్రాద్ధాలు.

4

ధర్మకార్యాలు, దానధర్మాలతో పితృ అనుగ్రహం.

మహాలయ అమావాస్య తేదీ, ప్రాముఖ్యత

ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు. ఈ సంవత్సరం మహాలయ అమావాస్య ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఏమి చేస్తే మంచిది? మహాలయ అమావాస్య విశిష్టత ఏంటి? మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మహాలయ అమావాస్య తేదీ, విశిష్టత

ఈ సంవత్సరం మహాలయ అమావాస్య సెప్టెంబర్ 21న వచ్చింది. ఆ రోజు ఆదివారం. మన హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ఉన్న విశిష్టత ఇంతా అంతా కాదు. అందులోనూ మహాలయ అమావాస్య ప్రత్యేకమైనది. మహాలయ అమావాస్య నాడు శుభకార్యాలు చేయకూడదు. ఈ అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది. పైగా ఆదివారం రావడం మరో విశేషం. మహాలయ అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించడం వలన పితృ దోషాల నుంచి బయట పడచ్చు.

మహాలయ అమావాస్య నాడు ఈ రుణాలను తీర్చాలి

పితృ రుణ తీర్పు: తర్పణాలు, శ్రాద్ధాలు

గరుడ పురాణం ఏమి చెప్తోందంటే– మనిషి జీవితకాలంలో మూడు రుణాలను తప్పక తీర్చుకోవాలని, ఒకటి దేవత రుణం, ఇంకొకటి ఋషి రుణం, మూడవది పితృ ఋణం. ఈ రుణాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. పితృదేవతలకు భక్తితో శ్రాద్ధ కర్మలు చేయాలి.

అమావాస్య నాడు తర్పణాలు వదలాలి. పితృదేవతల పేర్లు చెప్పి దానధర్మాలు చేయడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. మహాలయ అమావాస్యనాడు శ్రాద్ధ కర్మలు, తర్పణాలు వంటివి చేస్తే పితృదేవతలకు శాంతి కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.

మహాలయ అమావాస్య అంటే ఏమిటి?

మహాలయ అమావాస్య పూజ విధానం, ప్రయోజనాలు

ప్రతి ఏడాది 12 అమావాస్యలు వస్తూ ఉంటాయి. ఏ అమావాస్య నాడైనా పితృదేవతలను తలుచుకుని దానధర్మాలు చేసినా, తర్పణాలు వదిలినా, ఇలా ఏం చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఈ భాద్రపద మాసంలో బహుళ అమావాస్య చాలా విశేషమైనది. దీనిని మహాలయ అమావాస్య అంటారు. ఏ అమావాస్య రోజు అయినా ఏమి చేసినా, ఏమి చేయకపోయినా, ఈ అమావాస్య నాడు పితృదేవతల అనుగ్రహం కలిగేలా చేయాలని పండితులు అంటున్నారు.

అలా చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. మహాలయ అమావాస్యనాడు పితృదేవతలకు తర్పణాలు వదలాలి. ప్రతి అమావాస్యకు చేయలేని వారు, ఈ అమావాస్యనాడు తర్పణాలు వదలడం వలన ఏడాది మొత్తం చేసిన ఫలితం పొందుతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను పూజించడం, తర్పణాలు, శ్రాద్ధాలు చేయడం వల్ల పితృ ఋణం తీరి, వారి ఆశీస్సులు లభిస్తాయి. ధర్మకార్యాలు చేయడం ద్వారా మన జీవితం సుఖమయంగా సాగుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.