|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఎంగేజ్మెంట్ చేసుకున్న షణ్ముఖ్ జశ్వంత్! కుందనపు బొమ్మలా వైష్ణవి!!

Published: 25-02-2026, 10:35 AM
షాకింగ్: ఎంగేజ్మెంట్ చేసుకున్న షణ్ముఖ్ జశ్వంత్! కుందనపు బొమ్మలా వైష్ణవి!!
  • షణ్ముఖ్ జశ్వంత్ ఎంగేజ్మెంట్: కుందనపు బొమ్మలా వైష్ణవి, వైరల్ అవుతున్న ఫోటోలు!
  • దీప్తి సునైనాకు షాక్ ఇచ్చిన షణ్ముఖ్..కొత్త జీవితంలోకి అడుగు!
  • గతంలో దీప్తి సునైనాతో ప్రేమాయణం.. బ్రేకప్ తర్వాత కొత్త పార్టనర్ తో షన్ను!
  • ప్రేమకు నమస్కారం సినిమాలో షణ్ముఖ్.. త్వరలో విడుదల!

షణ్ముఖ్ జశ్వంత్ ఎంగేజ్మెంట్ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. యూట్యూబ్ స్టార్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షణ్ముఖ్ జశ్వంత్ ఎంగేజ్మెంట్..వైరల్ అవుతున్న ఫోటోలు!

షణ్ముఖ్ జశ్వంత్ కి పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ లో కెరీర్ మొదలుపెట్టి.. వెండి తెరపై సినిమాలు చేసే రేంజ్ ఎదిగాడు. అతను యూట్యూబ్ లో చేసిన ప్రతి వెబ్ సిరీస్ సూపర్ హిట్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో షణ్ముఖ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

తాజాగా షణ్ముఖ్ తన లైఫ్ కి సంబంధించిన బిగ్ అప్ డేట్ ని తన అభిమానులతో పంచుకున్నాడు.ఈ రోజు షన్ను ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని ఫోటోలతో పంచుకున్నాడు. తనకు కాబోయే భార్య పేరు వైష్ణవి అని… ఎగేజ్మెంట్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఫోటోల్లో వైష్ణవి చాలా అందంగా ఉంది. ఇద్దరి జంట చాలా బాగుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ఫోటోల్లో షన్ను చాలా సంతోషంగా కనపడుతున్నాడు.

దీప్తి సునైనాకు షాక్ ఇచ్చిన షణ్ముఖ్..కొత్త జీవితం ప్రారంభం!

గతంలో.. షన్ను.. దీప్తి సునైనాతో రిలేషన్ లో ఉన్నాడు. ఇద్దరూ కలిసి స్పెషల్ గా టాటూలు కూడా వేయించుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోయారు. తామిద్దరం విడిపోయాం అంటూ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. షన్ను తనకు ఉన్న క్రేజ్ తో బిగ్ బాస్ లో అడుగుపెట్టాడు.విన్నర్ అవ్వాల్సిన వాడు రన్నరప్ గా నిలిచాడు. అయితే.. అక్కడి అతని ప్రవర్తన నచ్చక.. దీప్తి సునైనా బ్రేకప్ చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే.. ఈ జంట మళ్లీ కలవాలని వారి అభిమానులు చాలా గట్టిగానే కోరుకున్నారు. కానీ, అది జరగలేదు. ఇద్దరూ తమ కెరీర్ మీద ఫోకస్ పెట్టారు.మళ్లీ ఈ జంట ఎప్పటికైనా కలుస్తారని వారి అభిమానులు ఎదురు చూశారు. కానీ.. సడెన్ గా షణ్ముఖ్ ట్విస్ట్ ఇచ్చాడు. నిజంగానే.. దీప్తితో బ్రేకప్ నుంచి బయటపడినట్లు ప్రకటించాడు.

షణ్ముఖ్ కొత్త సినిమా ‘ప్రేమకు నమస్కారం’!

కెరీర్ విషయానికి వస్తే… ప్రస్తుతం షణ్ముఖ్ హీరోగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఓటీటీలో లీలా వినోదం అనే సినిమా చేశాడు. ఆ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రేమకు నమస్కారం అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా టీజర్ విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది.

షణ్ముఖ్ ఎంగేజ్మెంట్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతని ఫ్యాన్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.