
📌 Key Points
- ‘యూత్’ మూవీని తెలుగులోకి తీసుకొచ్చిన హౌస్ ఫుల్ వినీత్, సందీప్‌లను అభినందించిన శర్వానంద్.
- తెలుగు ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తారని శర్వానంద్ కొనియాడారు.
- 23 ఏళ్ల యువకుడు దర్శకత్వం వహించి, నటించిన ‘యూత్’ చిత్రం విజయం సాధించడం ఆశ్చర్యం కలిగించిందని శర్వానంద్ అన్నారు.
- చెన్నైలో ‘యూత్’ మూవీ గురించి మాట్లాడుకోవడం విన్నానని, అక్కడ సినిమా సూపర్ హిట్ అయిందని శర్వానంద్ తెలిపారు.
శర్వానంద్ ‘యూత్’ మూవీ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 23 ఏళ్ల యువకుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయం సాధించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ గొప్పతనాన్ని కొనియాడారు.
‘యూత్’ మూవీ సక్సెస్ మీట్‌లో శర్వానంద్ కామెంట్స్
Sharwanand: ప్రపంచంలో తెలుగు ఇండస్ట్రీ లాంటి గొప్ప ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకుల వంటి గొప్ప ప్రేక్షకులు ఎక్కడా ఉండరని అన్నారు చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand). కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ ‘యూత్’ (Youth). తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల ఘన విజయాన్ని అందించారు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ (Youth Success Meet)ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలుగు సినిమా పరిశ్రమ గొప్పతనం గురించి శర్వానంద్
ఈ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ.. నేను చెన్నై వెళ్లినప్పుడు అక్కడ ‘యూత్’ మూవీ గురించి మాట్లాడుకోవడం విన్నాను. అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ అని తెలిసింది. తెలుగులో కూడా ఈ మూవీ హౌస్ ఫుల్స్‌తో నడుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వశిష్ట ఈ వేడుకకు రావాలని కాల్ చేశారు. మా హౌస్ ఫుల్ సందీప్, వినీత్, సతీష్ ఈ మూవీని తెలుగులోకి తీసుకొచ్చారని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది. వాళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నాను. ఎందుకంటే, నేను చేసిన అనేక సినిమాలకు వారు ప్రమోషన్స్ చేశారు. ప్రపంచంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లాంటి గొప్ప ఇండస్ట్రీ, మనలాంటి గొప్ప ప్రేక్షకులు ఎక్కడా ఉండరు. మనం అన్ని భాషల మూవీస్ చూస్తాం, ఆదరిస్తాం. ఇతర భాషల హీరోలను తెచ్చుకుని ఇక్కడ మూవీస్ నిర్మిస్తున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు హ్యాట్సాఫ్. ఈ సినిమాను ఒక 23 ఏళ్ల అబ్బాయి డైరెక్ట్ చేసి హీరోగా నటించి హిట్ కొట్టాడంటే నిజంగా నమ్మలేకపోయాను. ఈ టీమ్ మొత్తంలో నాకు హానెస్టీ కనిపిస్తోంది. ఇంత చిన్న వయసులో ఇలాంటి మంచి మూవీ ఎలా చేశారో.. వాళ్లను అడిగి తెలుసుకుంటాను. నేను తమిళ మూవీస్ చేసినప్పుడు కూడా అక్కడ థియేటర్స్ లో ఇలాగే ఆడియెన్స్ ఎంజాయ్ చేయడం చూశాను. ఇలాంటి మంచి మూవీస్ మరిన్ని చేయాలని ఈ టీమ్‌కు తెలియజేస్తున్నాను. ఈ సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్యూ చెబుతున్నానని అన్నారు.
23 ఏళ్ల డైరెక్టర్ ప్రతిభను మెచ్చుకున్న శర్వా
హీరో, డైరెక్టర్ కెన్ కరునాస్ మాట్లాడుతూ.. శర్వా సార్ ‘బైకర్’ మూవీ ట్రైలర్ బాగుంది. ఆ మూవీ రిలీజ్‌కు ఇక్కడికి వచ్చి చూస్తాను. సందీప్, వినీత్ మా మూవీ కంటెంట్‌ను నమ్మి తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ముఖ్యమని మరోసారి ప్రూవ్ చేశారు. మాలాంటి కొత్త వాళ్ల సినిమాను కూడా థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. మా మూవీ మా దగ్గర సక్సెస్ కావడం సంతోషం, కానీ మరో రాష్ట్రంలో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసి సక్సెస్ కావడం.. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలే మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. నేను ఈ సినిమాలో ప్రభాస్ సార్ అభిమానిగా నటించాను. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మా మూవీని సపోర్ట్ చేస్తున్నారు. మీరు, మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ తోనే కాదు ఫ్యామిలీతో కూడా వచ్చి మా మూవీని చూడాలని కోరుకుంటున్నానని తెలిపారు.
శర్వానంద్ ‘యూత్’ చిత్రం గురించి మాట్లాడుతూ, ఇలాంటి మంచి చిత్రాలను ప్రోత్సహించాలని కోరారు. తెలుగు ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తారని ఆయన మరోసారి గుర్తు చేశారు.


