|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లగ్జరీ కారు కొన్న శర్వానంద్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే? (వీడియో)

Updated: 11-12-2025, 11:13 PM
లగ్జరీ కారు కొన్న శర్వానంద్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే? (వీడియో)
  • శర్వానంద్ రూ. 2.5 కోట్ల విలువైన లెక్సస్ ఎల్ఎం 350H లగ్జరీ కారు కొనుగోలు.
  • విమానంలోని ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌ను పోలిన ఇంటీరియర్స్, 48 అంగుళాల LED స్క్రీన్.
  • మసాజ్ సీట్లు, పూర్తిగా వెనక్కి వాలే రెక్లైనర్ సీట్లు, చిన్న ఫ్రిజ్ వంటి సదుపాయాలు.
  • ‘నారి నారి నడుమ మురారి’, ‘భోగి’, ‘బైకర్’ వంటి సినిమాలతో ప్రస్తుతం బిజీగా శర్వానంద్.

టాలీవుడ్ నటుడు శర్వానంద్ తాజాగా రూ. 2.5 కోట్ల విలువైన లగ్జరీ లెక్సస్ ఎల్ఎం 350H కారును కొనుగోలు చేశారు. ఈ కారు కొనుగోలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ప్రత్యేకతలు, విశేషాలు తెలుసుకుందాం.

శర్వానంద్ లగ్జరీ కారు కొనుగోలు

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) పెళ్లి తర్వాత కొద్ది కాలం ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. త్వరలో ‘నారి నారి నడుమ మురారి’ (nari nari naduma murari)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి ‘సామజ వరగమన’ ఫేమ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో పాటు సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ ‘భోగి’టైటిల్‌తో మాస్ ఎంటర్‌టైనర్‌ను చేస్తున్నాడు. అంతేకాకుండా ‘బైకర్’ (Biker)సినిమాలో కూడా నటిస్తున్నాడు.

లెక్సస్ ఎల్ఎం 350H ధర, అద్భుతమైన ఫీచర్లు

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇక సినిమాలవిషయం పక్కన పెడితే.. తాజాగా, శర్వానంద్ ఓ లగ్జరీ కారు కోనుగోలు చేశాడు. కొత్త కారును షోరూమ్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన వారంతా ఆ కారు వివరాల గురించి సెర్చ్ చేయగా.. షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. సుమారు రూ. 2.5 కోట్ల విలువైన లెక్సస్ ఎల్ఎం 350H (Lexus LM 350H) అనే అల్ట్రా లగ్జరీ కారు బ్లాక్ కలర్‌లో ఉంది.

సినిమాలతో బిజీగా శర్వానంద్ షార్వా

ఇక ఇందులోని ప్రత్యేకతల విషయానికొస్తే.. విమానంలోని ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌లా ఈ కారు ఇంటీరియర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 48 అంగుళాల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌తో, పూర్తిగా వెనక్కి వాలే ఎయిన్‌లైన్ స్టై్ల్ రెక్లైనర్ సీట్లు, 23స్పీకర్లతో కూడిన మార్క్ లెనిన్స్‌న్ సౌండ్ సిస్టమ్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు సమాచారం. మసాజ్ సీట్లు, చిన్న ఫ్రిజ్ వంటి సదుపాయాలతో ఉందట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. సూపర్ అంటూ నెటిజన్లు శర్వానంద్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

శర్వానంద్ కొన్న ఈ లగ్జరీ కారు విశేషాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న శర్వానంద్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.