
📌 Key Points
- శర్వానంద్: ‘జాను’ సమయంలో ప్రమాదం, కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.
- బరువు పెరగడం వల్ల ‘శ్రీకారం’, ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ సినిమాల్లో ఛీ అనిపించింది.
- బైకర్ సినిమా కోసం మరింత కష్టపడ్డానని తెలిపిన శర్వానంద్.
- నారీ నారీ నడుమ మురారి సినిమాలో లుక్స్, స్టైలింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.
టాలీవుడ్ హీరో శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాత సినిమాల గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు శర్వానంద్ ఏం మాట్లాడారో చూద్దాం!
శర్వానంద్ కి యాక్సిడెంట్.. కోలుకోవడానికి ఎంత టైం పట్టిందంటే?
Sharwanand : కొత్త కొత్త కథలతో, కొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు శర్వానంద్. గత కొన్నాళ్లుగా కొత్తగా ప్రయత్నించినా, ఫ్యామిలీ, కమర్షియల్ సినిమాలు ట్రై చేసినా శర్వానంద్ కి వర్కౌట్ అవ్వలేదు. ఇటీవల సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి సినిమాతో సడెన్ గా వచ్చి మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా ప్రేక్షకులని ఫుల్ గా నవ్విస్తుంది.(Sharwanand)
నారీ నారీ నడుమ మురారి సినిమా సక్సెస్ అనంతరం శర్వానంద్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో తన పాత సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
బరువు పెరగడంపై శర్వానంద్ కామెంట్స్ వైరల్!
శర్వానంద్ మాట్లాడుతూ.. జాను సమయంలో నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు రికవరీ అవ్వడానికి చాలా టైం పట్టింది. అసలు చెయ్యి అయితే రాదు అన్నారు. అప్పుడు బాగా లావు అయిపోయాను. ఆ తర్వాత చేసిన శ్రీకారం, ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమాల్లో లావుగా కనిపించాను. ఆ సినిమాలు ఇప్పుడు చూస్తే అందులో నన్ను చూస్తుంటే నాకే ఛీ అనిపించింది. నేను అలా ఎలా చేసాను, నన్ను చూసి టికెట్లు ఎలా తెగుతాయి అని అనిపించింది.
‘బైకర్’ సినిమా కోసం శర్వానంద్ ఎంత కష్టపడ్డారో తెలుసా?
అందుకే ఆ సినిమాల తర్వాత నా బాడీ మీద ఫోకస్ చేశాను. ఎక్సర్సైజులు, యోగా అండ్ డైట్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి వెయిట్ తగ్గాను. ఈ నారీ నారీ నడుమ మురారి సినిమాలో నా లుక్స్, స్టైలింగ్ గురించి అంతా మాట్లాడుతున్నారు. నేను సన్నగా అయి నా బాడీ మీద ఫోకస్ చేశాను కాబట్టే అందరికి నచ్చుతుంది. నా నెక్స్ట్ సినిమా బైకర్ కోసం ఇంకా ఎక్కువ కష్టపడ్డాను అని తెలిపారు.
శర్వానంద్ తాజా కామెంట్స్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన సినిమాల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం.


