
యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన మేకోవర్‌తో వార్తల్లో నిలిచారు. ‘బైకర్’ సినిమా కోసం ఏకంగా 22 కేజీల బరువు తగ్గి సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన బరువు తగ్గడానికి కారణాలు, కూతురు పుట్టాక ఫిట్‌నెస్‌పై ఆయన దృక్పథం ఎలా మారిందో చూద్దాం.
Key Points
యంగ్ హీరో శర్వానంద్ 'బైకర్' సినిమా కోసం ఏకంగా 22 కేజీల బరువు తగ్గి సిక్స్ ప్యాక్ లుక్‌లోకి మారారు.
96 సినిమా షూటింగ్ లో భుజానికి గాయం కావడంతో చికిత్స అనంతరం 90 కేజీలకు బరువు పెరిగారు.
ప్రతిరోజు తెల్లవారు జామున 4:30 గంటలకు రన్నింగ్, జిమ్ చేస్తూ 8 నెలల పాటు తీవ్రంగా శ్రమించారు.
కూతురు పుట్టాక ఫిట్‌నెస్ అనేది సినిమాల కోసం మాత్రమే కాకుండా కుటుంబం కోసం కూడా అవసరమని శర్వానంద్ గ్రహించారు.
శర్వానంద్ 22 కేజీల బరువు తగ్గింది ఇలా!
యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం బైకర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో శర్వానంద్ యువ బైక్ రేసర్ గా నటించబోతున్నారు. ఈ మూవీ కోసం శర్వానంద్ తన కెరీర్ లోనే తొలిసారి సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ ఇంతలా తన మేకోవర్ మార్చుకోవడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మైండ్ బ్లాక్ చేసే అంశం ఏంటంటే శర్వానంద్ ఏకంగా 22 కేజీల బరువు తగ్గారు.
అంత బరువు తగ్గడం తనకి ఎలా సాధ్యం అయింది అనే విషయాన్ని శర్వానంద్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. శర్వానంద్ కొన్నేళ్ల క్రితం 96 అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ లో శర్వానంద్ కి షోల్డర్ ఇంజ్యురి జరిగింది. దీనితో శర్వానంద్ కి సర్జరీ జరగడం తో కొన్ని నెలలు విశ్రాంతి అవసరం అయింది. ఆ టైంలో శర్వానంద్ బాగా బరువు పెరిగారు. ఏకంగా 90 కేజీలకు శర్వానంద్ బరువు చేరుకుంది. అలా ప్రమాదంలో గాయపడడం, బరువు పెరగడం లాంటి సంఘటనలే తనని పూర్తిగా మార్చేశాయి అని శర్వానంద్ తెలిపారు.
‘బైకర్’ కోసం శర్వానంద్ మేకోవర్ రహస్యం
ఆ సమయంలో చాలా ఫ్రస్ట్రేషన్ కి గురయ్యాను. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. ఆకలి ఎక్కువ వేయడం వల్ల ఆహారం కూడా ఎక్కువగా తినేవాడిని. దీనితో బరువు విపరీతంగా పెరుగుతూ వచ్చాను. రెండేళ్ల క్రితం నాకు బైకర్ మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నేను 18 ఏళ్ళ కుర్రాడిగా కనిపించాలి. కాబట్టి తప్పనిసరిగా బరువు తగ్గాల్సిందే. ఈ లుక్ తో 18 ఏళ్ళ కుర్రాడిగా కనిపించడం సాధ్యం కాదు.
అందుకే వర్కౌట్స్ ప్రారంభించాను. ప్రతి రోజూ తెల్లవారు జామున 4.30 గంటలకు కేబీఆర్ పార్క్ లో రన్నింగ్ చేసేవాడిని. ఆ వెంటనే జిమ్ కి వెళ్ళేవాడిని. ఇలా 8 నెలల పాటు విరామం లేకుండా కష్టపడ్డాను. అలా చేయడం వల్ల నాలో ఓపిక పెరిగింది. అన్ని విషయాలపై ఫోకస్ కూడా చేయగలిగాను. ఆ టైంలో నాకు కూతురు పుట్టింది. పాప పుట్టాక తండ్రిగా బాధ్యతలు పెరిగాక నాలో మరో మార్పు వచ్చింది. ఆలోచనా ధోరణి మారింది. ఫిట్ నెస్ అనేది సినిమాల కోసం మాత్రమే కాదు, ఫ్యామిలీ కోసం కూడా అవసరం అని తెలుసుకున్నా.
కూతురు పుట్టాక మారిన శర్వానంద్ దృక్పథం
దీనితో మరో ఛాలెంజ్ తీసుకున్నా. నేను ఫుడీని. కాబట్టి ఇకపై కావలసినంత ఆహారం మాత్రమే తీసుకోవాలి అని నిర్ణయించుకున్నా. ఫిట్ నెస్ అనేది 70 శాతం మనం తినే ఫుడ్ పైనే ఆధారపడి ఉంటుంది. 30 శాతం వర్కౌట్స్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అవసరమైన పోషకాలు ఉండే బ్యాలెన్స్ ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నట్లు శర్వా తెలిపారు. దీనితో 2 ఏళ్ళలో 22 కేజీల బరువు తగ్గా. అంటే దాదాపు ప్రతి నెల ఒక కేజీ తగ్గుతూ వచ్చినట్లు తెలిపారు.
శర్వానంద్ తన శారీరక, మానసిక పరివర్తన ద్వారా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. ‘బైకర్’ సినిమా కోసం పడిన కష్టం, కుటుంబం పట్ల ఆయనకున్న నిబద్ధత నిజంగా ప్రశంసనీయం. ఈ కొత్త లుక్, ఆయన చెప్పిన ఫిట్‌నెస్ చిట్కాలు అభిమానులకు ఎంతో ఉపయోగపడతాయి.


