|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శేఖర్ కమ్ముల గొప్ప మనసు.. కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బు కాలిపోయిందని ఏడ్చిన తండ్రి.. తట్టుకోలేక లక్షలు పంపించిన డైరెక్టర్

Published: 19-06-2025, 1:46 PM
శేఖర్ కమ్ముల గొప్ప మనసు.. కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బు కాలిపోయిందని ఏడ్చిన తండ్రి.. తట్టుకోలేక లక్షలు పంపించిన డైరెక్టర్

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి అందరూ మెచ్చుకుంటారు. తాజాగా ఆయన చేసిన మంచి పని అందరినీ ఆకర్షించింది. కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బు కాలిపోయిన తండ్రికి ఆయన చేసిన సహాయం గురించి తెలుసుకుందాం.

Key Points

1

శేఖర్ కమ్ముల గొప్ప మనసుకు నిదర్శనం

2

కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బు కాలిపోయిన తండ్రికి సహాయం

4

శేఖర్ కమ్ముల సరళత, మంచితనం ప్రశంసనీయం

శేఖర్ కమ్ముల మంచితనం

శేఖర్ కమ్ముల సింప్లిసటీ గురించి ధనుష్, నాగార్జున, నాగచైతన్య లాంటి హీరోలు ఇంటర్వ్యూలు పెట్టి మరీ చెప్తున్నారు. కానీ ఇవన్నీ విన్న ఆయన మాత్రం సింపుల్‌గా అలా చూస్తు నవ్వేస్తున్నాడు. లవ్ స్టోరీ టైమ్‌లో శేఖర్ కమ్ములతో జర్నీ తనను పూర్తిగా మార్చేసిందని.. అనవసర ఖర్చుల నుంచి దూరంగా ఉంటున్నానని.. దాని వల్ల కొన్ని లక్షలు సేవ్ అవుతున్నాయని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు చైతు. నాగ్ కూడా ఇంత మంచి వ్యక్తిని ఎప్పుడూ కలవలేదని చెప్పుకొచ్చాడు. నిజమే వీరు చెప్పినట్లే శేఖరు కమ్ముల గొప్పోడే మరి. ఇందుకు ఓ ఉదాహరణ ఈ సంఘటన.

కూతురుకు పెళ్లి చేయాలని దాచుకున్న డబ్బు కాలిపోయిందని ఓ తండ్రి ఏడుస్తుండటం చూసిన డైరెక్టర్ తట్టుకోలేకపోయాడట. వెంటనే ఆ తండ్రికి కావాల్సిన రెండు లక్షలు పంపించాడట. దీంతో ఆ అమ్మాయి కూతురు యథావిధిగా జరిగిపోయింది. ఆ తండ్రి మనసు కుదుటపడింది. ఇంతటి మంచి మనసు ఎవరికి ఉంటుంది చెప్పండి. కోట్లు సంపాదించినోళ్లు కూడా రూపాయి బయటకు తీయాలంటే వెనుకా ముందు ఆలోచించే ఈ రోజుల్లో ఇలాంటి మంచి వ్యక్తులు ఉండటం నిజంగా గొప్ప విషయమే. కాగా ఆయన కోసమైనా కుబేర హిట్ కావాలని కోరుకుంటున్నారు నెటిజన్లు.

దురదృష్టవంతుడైన తండ్రికి సహాయం

సినీ ప్రముఖుల ప్రశంసలు

శేఖర్ కమ్ముల వంటి మంచి మనస్సు గల వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. కోట్ల రూపాయలు సంపాదించినా, మనిషి మనసులోని మంచితనం చాలా ముఖ్యమని ఈ సంఘటన చాటుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.