|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏదో లాభం వస్తుందని శివ రీ రిలీజ్ చేయట్లేదు.. మూవీ చూశాక అమలకు అలా మెసేజ్ పెట్టా.. నాగార్జున కామెంట్స్

Published: 11-11-2025, 5:56 AM
ఏదో లాభం వస్తుందని శివ రీ రిలీజ్ చేయట్లేదు.. మూవీ చూశాక అమలకు అలా మెసేజ్ పెట్టా.. నాగార్జున కామెంట్స్

కింగ్ నాగార్జున నటించిన కల్ట్ క్లాసిక్ శివ 4K డాల్బీ అట్మాస్‌లో నవంబర్ 14న రీ రిలీజ్ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సందర్భంగా ఈ చిత్రం తిరిగి థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శివ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Key Points

1

నవంబర్ 14న శివ సినిమా 4K డాల్బీ అట్మాస్‌లో రీ రిలీజ్ కానుంది.

2

అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఈ రీ రిలీజ్ జరుగుతోంది.

4

శివ రీ రిలీజ్ లాభం కోసమని కాదని, అది వారికి చాలా పర్సనల్ అని నాగార్జున తెలిపారు.

శివ రీ రిలీజ్: నాగార్జున, ఆర్జీవీ ప్రత్యేక వ్యాఖ్యలు

టాలీవుడ్ కింగ్ నాగార్జున సూపర్ హిట్ ఫిల్మ్ శివ రీ రిలీజ్ కానుంది. నవంబర్ 14న 4కే డాల్బీ ఆట్మాస్‌లో శివ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మీడియాకు శివ స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. ఈ సందర్భంగా శివ రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో నాగార్జున, దర్శకుడు ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ ‘శివ’ బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను మార్చేసింది. ‘బిఫోర్ శివ’, ‘ఆఫ్టర్ శివ’ అన్నట్లుగా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు.

అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్‌లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా శివ స్పెషల్ ప్రిమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో కింగ్ నాగార్జున , దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

నాగార్జున జీవితంలో శివ అంత పర్సనలా?

-సౌండ్ అద్భుతంగా వినిపిస్తుంది అని అంటున్నారు. ఇదంత రాము చేసిన ఎఫర్ట్. డాల్బీ అట్మాస్‌కి తగ్గట్టుగా ఈ సౌండ్‌ని రీ క్రియేట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ టీం చాలా అద్భుతంగా చేశారు.

-మీరు చూసి ఎంత ఇంప్రెస్ అయ్యారు మొన్న నేను చూసి అంతే కొత్తగా ఫీలయ్యా. కొత్త సినిమా చూసినట్టుగా అనిపించింది. సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సౌండ్ బాగుందనే కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఫస్ట్ టైం నేను సౌండ్ బాగుంది అనే టాకు శివ సినిమా కోసం విన్నాను.

లాభాపేక్ష లేకుండా శివను రీ రిలీజ్ చేస్తున్నారా?

-శివ మాకు చాలా పర్సనల్. ఇది 50 ఇయర్స్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. 50 ఇయర్స్ యానివర్సరీ రోజున సినిమాని రీ రిలీజ్ చేయాలనుకున్నాం. నిజానికి పదేళ్ల క్రితమే 4కే చేసాము. అయితే అప్పుడు డాల్బీ జరగలేదు.

-ఇప్పుడు అన్ని హంగులతో ఒక స్పెషల్ అకేషన్‌లో సినిమా రిలీజ్ చేస్తున్నాం. నిజానికి ఇది ఏదో ప్రాఫిట్ వస్తుందని చేయలేదు. సినిమాకి ఏం కావాలో అన్ని ఆర్జీవీ అడిగాడు. మేమిచ్చాం.

నాగార్జున, ఆర్జీవీ చెప్పిన విషయాలను బట్టి శివ కేవలం ఒక సినిమా కాదని, వారితో వ్యక్తిగత అనుబంధం కూడా ఉందని తెలుస్తోంది. 4K డాల్బీ అట్మాస్‌లో శివ అనుభవం ప్రేక్షకులకు కొత్తగా ఉండనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.