
📌 Key Points
- 90s వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన శివాజీ నిర్మాతగా మారి ‘సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’ సినిమా చేస్తున్నాడు.
- ఈ మూవీలో లయ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
- సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రంజిన్ రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
- ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ లయ గురించి శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు, ఆమె కోపరేషన్ గురించి గొప్పగా చెప్పాడు.
టాలీవుడ్ హీరో శివాజీ రీ ఎంట్రీతో అదరగొడుతున్నారు. ఆయన స్వయంగా నిర్మిస్తున్న ‘సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’ చిత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
లయ గురించి శివాజీ ఏమన్నారంటే?
90s వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో దూసుకు పోతున్న హీరో శివాజీ (Sivaji) ప్రస్తుతం ఆయనే స్వయంగా నిర్మాత మారి తన శ్రీ శివాజీ ప్రొడక్షన్స్(Sri Shivaji Productions) పతాకంపై ‘సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో లయ (Laya) శివాజీకి జంటగా నటిస్తోండగా ప్రిన్స్(Prinse), అలీ(ali), ధన్‌రాజ్(Dhanraj), ఇమ్మాన్యూయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
‘సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’ మూవీ విశేషాలు
సుధీర్ శ్రీరామ్(Sudheer Sreeram) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రంజిన్ రాజ్(Ranjin Raj) సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఈ నెల 12న ఈటీవీ విన్(ETV Win)లో స్ట్రీమింగ్ కానున్నది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. అయితే ఈ ఈవెంట్‌లో శివాజీ హీరోయిన్ లయ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
అనిల్ రావిపూడి స్పెషల్ గెస్ట్!
ఆయన మాట్లాడుతూ.. ‘హీరోయిన్ లయ గురించి ఎంత చెప్పినా తక్కువే. 6:30కి షాట్ తీయాలంటే తను ఎర్లీ మార్నింగ్ 3:30కే లొకేషన్‌కు వచ్చింది. తను షూటింగ్ చేసినన్ని రోజులు ప్రతి సందర్భాన్ని చెప్పుకోవచ్చు. అంత బ్రహ్మాండంగా కోపరేట్ చేసి ఎలా గైనా సరే ఒక మంచి హిట్ సినిమా అవ్వాలని తను చాలా కష్టపడింది. చాలా సపోర్ట్ చేసింది. ఇంత చేసిన నేను లయకు థ్యాంక్యూ తప్పా ఏమీ చెప్పుకోలేను.. థ్యాంక్యూ లయ థ్యాంక్యూ సో మచ్’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
శివాజీ, లయ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


