
📌 Key Points
- శివాజీ ‘దండోర’ ఈవెంట్‌లో హీరోయిన్స్ పై చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.
- హెబ్బా పటేల్ స్పందిస్తూ మహిళలకు నచ్చిన డ్రెస్ వేసుకునే స్వాతంత్య్రం ఉందన్నారు.
- ఇతరుల కామెంట్స్ పై తాను స్పందించడం ఇష్టం లేదని హెబ్బా స్పష్టం చేశారు.
- హెబ్బా పటేల్ నటించిన తాజా చిత్రం ‘ఈషా’ నేడు రిలీజ్ అయింది.
నటుడు శివాజీ హీరోయిన్స్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదంపై పలువురు నటీనటులు స్పందిస్తుండగా, తాజాగా హెబ్బా పటేల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మహిళలకు నచ్చిన బట్టలు వేసుకునే స్వాతంత్య్రం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటన సినీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
శివాజీ కామెంట్స్ తో ఇండస్ట్రీలో దుమారం
టాలీవుడ్ యాక్టర్ శివాజీ(Shivaji) ‘దండోర’(Dandora) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ పై చేసిన కామెంట్స్ గత రెండు రోజులుగా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన కామెంట్స్ పై ఇప్పటికే కొంత మంది స్పందించి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో తాజాగా హెబ్బా పటేల్(Hebah Patel) ఈ కామెంట్స్ పై షాకింగ్ రిప్లై ఇచ్చింది. ప్రజెంట్ హీరోయిన్స్ డ్రెస్సింగ్ గురించి ట్రెండింగ్ టాపిక్ నడుస్తోంది.
దీనిపై మీ రియాక్షన్ ఏంటి అని యాంకర్ అడుగగా.. దీనికి హెబ్బా స్పందిస్తూ ‘నాకు ఎవరి కామెంట్స్ పై స్పందించాలని, వాళ్ల విషయాల్లో తల దూర్చడం కానీ నాకు ఇష్టం లేదు.. మనం వీటికి ఎంత దూరం అంటే అంత మంచిది.. అయితే ఓ మహిళ ఆమెకు నచ్చిన డ్రెస్సు వేసుకునే స్వాతంత్య్రం ఉంది. అయితే దీనిపై నాకు స్పందించాలని లేదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
హెబ్బా పటేల్ బోల్డ్ రియాక్షన్
కాగా హెబ్బా పటేల్ ‘కుమారి 21ఎఫ్’(Kumari 21F) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రజెంట్ ఈ భామ నటించిన ‘ఈషా’(Eesha) మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. శ్రీనివాస్ మన్నె(Srinivas Manne) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ రాజ్(Akhil Raj)తో పాటు త్రిగుణ్(Trigun) హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్ టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు’.. అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ (పోస్ట్)
హెబ్బా లేటెస్ట్ మూవీ ‘ఈషా’ విశేషాలు
నా పెద్ద కొడుకుకి నేను వేసుకునే బట్టలు నచ్చవు.. ఛీ అమ్మా బాలేవు అని అంటాడు.. అనసూయ పాత వీడియో వైరల్
A post shared by Hebah Patel (@ihebahp)
మొత్తంగా, శివాజీ వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో చర్చ కొనసాగుతోంది. హెబ్బా పటేల్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పి, మహిళల స్వాతంత్య్రాన్ని సమర్థించారు. ఈ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.


