|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: బిగ్‌బాస్ చరిత్ర తిరగరాసిన లేడీ టైగర్! ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Published: 19-01-2026, 1:15 AM
షాకింగ్: బిగ్‌బాస్ చరిత్ర తిరగరాసిన లేడీ టైగర్! ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
  • తమిళ బిగ్‌బాస్ సీజన్ 9 విన్నర్‌గా దివ్య గణేష్ సంచలనం
  • వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చి అందరి అంచనాలను తలకిందులు చేసింది
  • విజేతగా నిలిచిన దివ్య గణేష్‌కు రూ.50 లక్షల ప్రైజ్ మనీ
  • ‘లేడీ టైగర్’ అంటూ దివ్య గణేష్‌ను ప్రశంసిస్తున్న నెటిజన్లు, అభిమానులు

తమిళ బిగ్‌బాస్ సీజన్ 9లో ఊహించని ఫలితం! వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అడుగుపెట్టిన దివ్య గణేష్ విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆమె ప్రయాణం, గెలుపు వెనుక ఉన్న అసలు కథ తెలుసుకోండి.

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సంచలనం సృష్టించిన దివ్య

ప్రేక్షకులను చివరి వరకూ ఉత్కంఠలో ఉంచిన రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ఈ సీజన్‌లో కళ్యాణ్ పడాల విజేతగా నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పటి వరకూ తెలుగు బిగ్‌బాస్‌కు లేడీ విన్నర్ లేకపోవడం విశేషం. ఓటీటీ వెర్షన్‌లో మాత్రమే బింధు మాధవి ఈ ఘనత సాధించింది. ఇక మరోవైపు తమిళం, కన్నడ భాషల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) హోస్ట్‌గా వ్యవహరించిన తమిళ బిగ్‌బాస్ సీజన్–9 జనవరి 18న గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. గతేడాది అక్టోబర్ 5న ప్రారంభమైన ఈ షోలో మొత్తం 20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు.

లేడీ టైగర్‌గా మారిన భాగ్యలక్ష్మి సీరియల్ నటి

మూడో వారంలో దివ్య గణేష్, అమీత్, సాండ్రా, ప్రజిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్‌లోకి అడుగుపెట్టారు. వైల్డ్ కార్డ్‌గా వచ్చినప్పటికీ దివ్య గణేష్(Divya Ganesh) క్రమంగా తన ఆటతీరును మెరుగుపరుచుకుంటూ బలమైన కంటెస్టెంట్‌గా మారింది. జనవరి 18న జరిగిన గ్రాండ్ ఫినాలేలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె విన్నర్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో శబరి ఫస్ట్ రన్నరప్‌గా, వికెల్స్ విక్రమన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఇక విజేతగా నిలిచిన దివ్యకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీని దక్కించుకుంది. టెలివిజన్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్య గణేష్, ‘భాగ్యలక్ష్మి’ సీరియల్‌లో జెన్నీ పాత్రతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

దివ్య గణేష్ గెలుపు వెనుక అసలు కారణం ఇదేనా?

ఆ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ఆమె, ప్రారంభంలో కొంత సైలెంట్‌గా కనిపించినప్పటికీ, రోజురోజుకీ తన ఆటను బలంగా మార్చుకుంది. చివరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి విన్నర్‌గా నిలిచి, తమిళ బిగ్‌బాస్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ విజయంతో సోషల్ మీడియాలో దివ్య గణేష్‌కు ప్రశంసల వర్షం కురుస్తోంది. నెటిజన్లు ఆమె ప్రయాణాన్ని మెచ్చుకుంటూ ‘లేడీ టైగర్’ అనే బిరుదుతో అభినందనలు తెలియజేస్తున్నారు.

దివ్య గణేష్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలవడం నిజంగా ఒక సంచలనం. ఆమె ఆటతీరు, పట్టుదల ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.