|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నువ్వు ఎంత ప్రయత్నించిగా నా నుండి తప్పించుకోలేవు.. హాట్ టాపిక్‌గా మారిన శ్రద్ధా కపూర్ పోస్ట్.. అతడి గురించేనా?

Published: 29-06-2025, 5:15 AM
నువ్వు ఎంత ప్రయత్నించిగా నా నుండి తప్పించుకోలేవు.. హాట్ టాపిక్‌గా మారిన శ్రద్ధా కపూర్ పోస్ట్.. అతడి గురించేనా?

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రేమ, వేదనను కలిగి ఉన్న ఈ పోస్ట్ ఆమె ప్రేమ జీవితంపై అనుమానాలను రేకెత్తిస్తోంది. వార్తల ప్రకారం, ఆమె రాహుల్ మోడీతో డేటింగ్ చేస్తోంది.

Key Points

1

శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.

2

పోస్ట్‌లో ప్రేమ, వేదన కలిగి ఉన్నట్లుగా ఉంది.

4

వీరిద్దరి పెళ్లి త్వరలోనే జరుగబోతుందని ప్రచారం.

శ్రద్ధా కపూర్ యొక్క ఇన్‌స్టా పోస్ట్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) విభిన్న కథలను ఎంచుకుంటూ తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ భామ అనుకున్నంత క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. తెలుగు, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గత ఏడాది ‘స్త్రీ-2’ సినిమాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడు స్త్రీ-3Stree-3, నాగిన్ వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ప్రేమనూ, వేదనను కలగలిపి నట్లు‌గా ఉండేలా ఉన్న పోస్ట్‌తో అందరినీ ఆలోచింపచేసింది.

‘‘నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను నీ పక్కన కూర్చుంటాను. నువ్వు విచారంగా ఉన్నప్పుడు నేను నిన్ను దగ్గరికి తీసుకోవడానికి వస్తాను. నువ్వు తప్పిపోతావని నాకు తెలుసు. నువ్వు పారిపోతావనీ కూడా తెలుసు. కానీ నేను నిన్ను కచ్చితంగా కనుక్కుంటాను. నిన్ను ఇక్కడే ఉండేలా చేస్తాను. నువ్వు నా నుండి ఎంత దూరం వెళ్లాలని చూసినా నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీడలా నీ వెంటే నేను వస్తాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆమె ఈ పోస్ట్ రిలేషన్ షిప్ గురించే పెట్టింది కావచ్చని అనుకుంటున్నారు. కాగా, గత కొద్ది కాలంగా శ్రద్ధా కపూర్ సినీ రచయిత రాహుల్ మోడీతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.నిత్యం వీరిద్దరు కలిసి వెకేషన్స్‌కు కూడా వెళ్తున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు టాక్. ఇక ఈ క్రమంలో.. శ్రద్ధా ఇలాంటి పోస్ట్ పెట్టడంతో చర్చకు దారితీసింది.

ప్రేమ, వేదనతో కూడిన పోస్ట్

రాహుల్ మోడీతో శ్రద్ధా డేటింగ్?

శ్రద్ధా కపూర్ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ మోడీతో ఆమె సంబంధంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిద్దరి భవిష్యత్తు ఏమిటో తెలియాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.