
ప్రముఖ నటి శ్రద్ధా శ్రీనాథ్ తొలి థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దసరా కానుకగా విడుదలైన ఈ తమిళ సిరీస్ తెలుగుతో పాటు పలు భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ విశేషాలు తెలుసుకుందాం.
Key Points
శ్రద్ధా శ్రీనాథ్ నటించిన తొలి థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్'.
నెట్‌ఫ్లిక్స్‌లో దసరా సందర్భంగా గురువారం (అక్టోబర్ 2) స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంది.
శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో గేమ్ డెవలపర్‌గా నటించగా, రాజేష్ సెల్వ దర్శకత్వం వహించారు.
ది గేమ్ వెబ్ సిరీస్ విశేషాలు
ప్రముఖ నటి శ్రద్ధా శ్రీనాథ్ నటించిన తొలి థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది గేమ్. యు నెవర్ ప్లే అలోన్ అనే ట్యాగ్ టైన్ కూడా పెట్టారు. ఈ సిరీస్ దసరా సందర్భంగా గురువారం (అక్టోబర్ 2) స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన తొలి తమిళ వెబ్ సిరీస్ ఇదే.
ది గేమ్ ఓటీటీ స్ట్రీమింగ్
ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్ అనే తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. నెల రోజుల కిందటే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ వివరాలు
సోషల్ మీడియా ట్రోల్స్ ను ధైర్యంగా ఎదుర్కొనే ఓ అమ్మాయి చుట్టే తిరిగే స్టోరీగా ది గేమ్ వెబ్ సిరీస్ కనిపిస్తోంది. ఈ సిరీస్ లోని చిన్న వీడియో క్లిప్ పోస్ట్ చేస్తూ.. స్ట్రీమింగ్ మొదలైనట్లు నెట్‌ఫ్లిక్స్ గురువారం (అక్టోబర్ 2) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
ది గేమ్ వెబ్ సిరీస్ గురించి..
ది గేమ్ కథాంశం, నటీనటులు
ది గేమ్ వెబ్ సిరీస్ లో శ్రద్ధా శ్రీనాథ్ తోపాటు సంతోష్ ప్రతాప్, చాందిని, శ్యామ హరిణి, బాలా హసన్, సుభాష్ సెల్వమ్, వివియా శాంత్, ధీరజ్, హేమ కూడా నటిస్తున్నారు. రాజేష్ సెల్వ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. దీప్తి గోవింరాజన్ కథ అందించగా.. అప్లౌజ్ సౌత్ నిర్మించింది. ఇందులో శ్రద్ధా ఓ గేమ్ డెవలపర్ గా నటించింది. ఇది అతిగా కనెక్ట్ అయిన ప్రపంచంలో జీవించడానికి చెల్లించాల్సిన మూల్యాన్ని కళ్లకు కట్టే థ్రిల్లర్ అని నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్ గురించి తెలిపింది.
రహస్యాలు స్క్రీన్ల ద్వారా అందరిలోకీ వెళ్లిపోతున్నప్పుడు, నమ్మకం ఒత్తిడికి లోనై విచ్ఛిన్నం అవుతున్నప్పుడు, మిస్టరీ లాగా మొదలైన ఈ కథ వ్యక్తిత్వం, అధికారం లోతైన అన్వేషణగా మారుతుంది అని ఆ ఓటీటీ తెలిపింది. ఆ మధ్య తెలుగులో వెంకటేశ్ తో కలిసి సైంధవ్ మూవీలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్.. ఇప్పుడీ ది గేమ్ వెబ్ సిరీస్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు.
‘ది గేమ్’ వెబ్ సిరీస్ ఒక మిస్టరీగా మొదలై, వ్యక్తిత్వం, అధికారంపై లోతైన అన్వేషణగా మారుతుంది. ఆధునిక ప్రపంచంలో రహస్యాలు, నమ్మకాలు ఎలా ప్రభావితమవుతాయో కళ్లకు కట్టే ఈ థ్రిల్లర్ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.


