
📌 Key Points
- శ్రేయ ఘోషల్ ముంబైలోని వర్లీలో ఒక లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.
- ఈ ఫ్లాట్ విలువ దాదాపు రూ. 29.70 కోట్లు ఉంటుందని అంచనా.
- ఫ్లాట్ కొనుగోలును శ్రేయ తన తల్లిదండ్రుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు.
- శ్రేయ ఘోషల్ సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో సింగర్‌గా బిజీగా ఉన్నారు.
ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ ముంబైలోని వర్లీలో ఒక ఖరీదైన లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారు. ఈ విల్లా విలువ దాదాపు 29.70 కోట్లు ఉంటుందని సమాచారం. ఈమె తన తల్లిదండ్రుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
ముంబైలో శ్రేయ ఘోషల్ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు
Singer Shreya Ghoshal: ప్లే బ్యాక్ సింగర్ గా తన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలను పాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో శ్రేయ ఘోషల్ ఒకరు. ఇలా సింగర్ గా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న శ్రేయ ఘోషల్ సింగర్ గా భారీ స్థాయిలో సంపాదిస్తున్నారని చెప్పాలి. ఈమె ప్లే బ్యాక్ సింగర్ గా మాత్రమే కాకుండా ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అలాగే ఒక మ్యూజిక్ కన్సర్ట్ లో శ్రేయ ఘోషల్ పాల్గొంటూ కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటూ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెడుతున్నారు.
ఇప్పటికే ఈమె హైదరాబాద్ ముంబై వంటి నగరాలలో ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేశారు. అయితే తాజాగా ముంబైలో ఈమె మరో ఖరీదైన లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయం కాస్త బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో ఒకటిగా పేరుగాంచిన ‘వర్లీ’ (Worli)లో శ్రేయా ఘోషల్ ఒక ఖరీదైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈమె ఈ ఖరీదైన ఆస్తిని తన పేరుతో పాటు తన తల్లిదండ్రుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు సమాచారం.
ఫ్లాట్ వివరాలు, ధర
ఇక ఈ అపార్ట్మెంట్ అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయబడి ఉంది. ఈ ప్లాట్ కార్పెట్ ఏరియా 2,430.06 చదరపు అడుగులు కాగా, మొత్తం విస్తీర్ణం 2,750.28 చదరపు అడుగులుగా ఉంది. ఈ ఖరీదైన విల్లా కోసం సింగర్ శ్రేయ ఘోషల్ రూ. 29.70 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫ్లాట్ కి సంబంధించిన డీలింగ్ ఏప్రిల్ 1, 2026న పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ విల్లా కోసం రూ. 1.78 కోట్ల స్టాంప్ డ్యూటీని, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లించినట్టు బాలీవుడ్ సమాచారం. ఇలా ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఈమె కోట్లు విలువచేసే ఆస్తులను కొనుగోలు చేయటంతో ఈ విషయం కాస్త బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఒక్క పాటకు లక్షల్లో రెమ్యూనరేషన్..
సింగర్‌గా శ్రేయ ఘోషల్ కెరీర్
ఇక శ్రేయ ఘోషల్ విషయానికి వస్తే .. సింగర్ గా ఈమె సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ పాటలను ఆలపించి మంచి సక్సెస్ అందుకున్నారు .ఈమె 2002వ సంవత్సరంలో దేవదాస్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి సింగర్ గా పరిచయమయ్యారు. సరిగమప అనే షో ద్వారా శ్రేయ ఘోషల్ తన సింగింగ్ టాలెంట్ బయట పెడుతూ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈమె సింగర్ గా ఒక్కపాటుకు సుమారు 25 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే సింగర్ల జాబితాలో శ్రేయ ఘోషల్ ఉండటం విశేషం.
శ్రేయ ఘోషల్ ముంబైలో ఖరీదైన విల్లా కొనడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె తన గానంతోనే కాకుండా ఆస్తులతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.


