|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్యాక్ గ్రౌండ్ లేనిదే ఛాన్స్ లేదా? నెపోటిజంపై శృతి హాసన్ సంచలన కామెంట్స్!

Published: 22-03-2026, 6:30 AM
బ్యాక్ గ్రౌండ్ లేనిదే ఛాన్స్ లేదా? నెపోటిజంపై శృతి హాసన్ సంచలన కామెంట్స్!
  • శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ బ్యాక్ గ్రౌండ్ వల్లే తనకు సులువుగా పాట పాడే అవకాశం వచ్చిందని అంగీకరించింది.
  • చిన్నప్పటి నుంచి పండిత్ మనోహర్ కులకర్ణి, సురేష్ వాడక్కర్ వంటి మహామహుల వద్ద సంగీతం నేర్చుకున్నట్లు శృతి తెలిపింది.
  • కెరీర్ పరంగా ఎప్పుడూ తండ్రి సలహాలు తీసుకోలేదని, రజినీకాంత్ సలహా కూడా అవసరం లేదని శృతి పేర్కొంది.
  • రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కూడా సినిమా కోసం ప్రాణాలను ఇచ్చే పని రాక్షసులని శృతి కొనియాడింది.

సినీ పరిశ్రమలో నెపోటిజం గురించి శృతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు సినిమా నేపథ్యం ఉండటం వల్లే సులువుగా అవకాశాలు వచ్చాయని ఆమె అంగీకరించింది. దీనిపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నెపోటిజంపై శృతి హాసన్ కీలక వ్యాఖ్యలు

Shruti Haasan:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నెపోకిడ్ అనే అంశం ఎప్పటికీ చర్చగానే నిలుస్తుంది. ఇండస్ట్రీలోకి స్వతహాగా వచ్చే అవకాశాలు అందుకొని నేడు ఉన్నత స్థానంలో నిలిచిన ఎంతోమంది ఇండస్ట్రీలోకి రావడానికి పడ్డ కష్టాల గురించి చెప్పినప్పుడు నిజంగానే బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీ ఎంట్రీ సులభం అవుతుందని అనుకునే వాళ్ళు చాలామంది. కానీ జాన్వీ కపూర్ లాంటి హీరోయిన్లు మాత్రం నెపోకిడ్ అనే అంశాన్ని ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూనే ఉంటారు. సెలబ్రిటీలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఎదుగుదల ఉండదు అని, సొంత తెలివితేటలతో ఇండస్ట్రీలో పైకి ఎదగాలి అని, తాము కూడా ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ తాజాగా నెపోకిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతిహాసన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాల్సిందే అంటూ తన మాటగా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన శృతిహాసన్ మాట్లాడుతూ.. బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలోకి ఎంట్రీ సులభం అవుతుంది అనే వాదనను నేను కూడా అంగీకరిస్తాను. ఎందుకంటే నాకు తొలిసారి పాట పాడే అవకాశం చాలా ఈజీగా వచ్చింది. దీనికి కారణం మా నాన్న కమలహాసన్. ఆయన సినిమా బ్యాక్ గ్రౌండ్ వల్లే నాకు ఇండస్ట్రీలో అవకాశం సులభంగా లభించింది. అందుకే నెపోకిడ్ అంశంపై ఎవరైనా మాట్లాడితే నేను కూడా ఫైట్ చేయను అంటూ శృతిహాసన్ కామెంట్ చేసారు.

తండ్రి బ్యాక్ గ్రౌండ్ వల్లే అవకాశం: శృతి

నేను చిన్నప్పుడే పండిత్ మనోహర్ కులకర్ణి, సురేష్ వాడక్కర్ వంటి మహామహుల వద్ద సంగీతం నేర్చుకున్నాను. నాకు చాలా మంచి గురువులు కూడా లభించారు. కెరియర్ లో ఏం చేయాలి? ఎటువైపు అడుగులు వేయాలి? అనే విషయంలో మాత్రం నేనెప్పుడూ మా నాన్న సలహా తీసుకోలేదు. అలాగే రజినీకాంత్ ను కూడా సలహా తీసుకోలేదు. కాకపోతే వాళ్ళిద్దరూ కూడా చాలా కష్టపడ్డ వాళ్లే అంటూ శృతిహాసన్ తెలిపింది.

కష్టపడే తత్వం కలిగిన రజినీ, కమల్

అటు రజినీకాంత్ ఇటు కమలహాసన్ ఇద్దరూ కూడా పని రాక్షసులే దేనిని కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఇష్టంగా నిశ్శబ్దంగా కష్టపడతారు . సినిమా కోసం ప్రాణాలైనా ఇస్తారు అటు ఆఫీస్ ను ఇటు ఇంటిని చక్కగా నిర్వహిస్తారు. నాన్న అయితే ఇంస్టాగ్రామ్ లో కనిపించే పిచ్చి రీల్స్ ఏవేవో పంపేవాడు అది చూసినప్పుడు ఈ ఆంటీ ఫన్నీగా ఏం లేదు నాన్న అని అనేదాన్ని . అప్పుడు ఆయన ఇంకొన్ని మంచి రీల్స్ పంపించేవారు. ముఖ్యంగా చిన్న పాప అందంగా పాడుతున్నట్లు, గ్రామాలలో వంట చేసే వీడియోలు ఇలాంటివి చూసి ఆయన ఎంతో సంతోషిస్తూ ఉండేవాడు అంటూ తెలిపింది శృతిహాసన్.

శృతి హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, లేకున్నా ప్రతిభతోనే రాణించగలమని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం శృతి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.