
📌 Key Points
- సిద్దు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మూడో చిత్రం అధికారికంగా ప్రారంభమైంది.
- డీజే టిల్లు, టిల్లు స్క్వైర్ బ్లాక్ బస్టర్ల తర్వాత అదే బ్యానర్‌లో సిద్దు చేస్తున్న తాజా సినిమా ఇది.
- ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టును దర్శకుడు స్వరూప్ RSJ (ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేం) తెరకెక్కిస్తున్నారు.
- సిద్దు విలేజ్ బ్యాక్‌డ్రాప్ థ్రిల్లర్ జానర్‌లో సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో తన మూడో సినిమాను ప్రారంభించాడు. డీజే టిల్లు, టిల్లు స్క్వైర్ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. స్వరూప్ RSJ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం థ్రిల్లర్ జానర్‌లో సిద్దు సరికొత్తగా కనిపించనున్నాడు.
సిద్దు-సితార: హ్యాట్రిక్ దిశగా?
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) హీరోగా హీరోగా కొత్త సినిమా ప్రారంభమయ్యింది. ఆయనకు డీజే టిల్లు, టిల్లు స్క్వైర్ లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నాడు.
Siddhu Jonnalagadda new movie started under Sithara entertainments banner
కొత్త దర్శకుడు, సరికొత్త అవతారం
Siddhu Jonnalagadda: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా హీరోగా కొత్త సినిమా ప్రారంభమయ్యింది. ఆయనకు డీజే టిల్లు, టిల్లు స్క్వైర్ లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నాడు. తాజాగా వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టును దర్శకుడు స్వరూప్ RSJ తెరకెక్కిస్తున్నాడు. ఈ దర్శకుడు గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాల్లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Bandla Ganesh: బండ్ల గణేష్ కొత్త నిర్మాత సంస్థ ‘BG బ్లాక్ బస్టర్స్’.. ఇకనుంచి తగ్గేదే లేదట..
థ్రిల్లర్ జానర్‌లో స్టార్ బాయ్
మిషన్ ఇంపాజిబుల్ సినిమా అనుకున్న సక్సెస్ కాకపోవడంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డతో మరోసారి తన మార్క్ ను చూపించుకోవడానికి ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇక, సిద్దు(Siddhu Jonnalagadda)- స్వరూప్ సినిమాకు సంబందించిన కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చూస్తుంటే విలేజ్ బ్యాక్డ్రాప్ లో థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా రానుంది అని తెలుస్తోంది. సిద్దు కూడా గతంలో ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అని సమాచారం. అలాగే, తన మార్క్ కామెడీ కూడా ఎక్కడ మిస్ అవదట. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షార్ట్ చేసి 2026 సమ్మర్ కి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట మేకర్స్. మరి ఈ సినిమా అయినా సిద్దుకి అనుకున్న విజయాన్ని అందిస్తుందా అనేది చూడాలి.
Siddhu Jonnalagadda new movie started under Sithara entertainments banner
సిద్దు జొన్నలగడ్డ, స్వరూప్ RSJ కాంబినేషన్‌లో వస్తున్న ఈ థ్రిల్లర్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సితార బ్యానర్ అందించిన మునుపటి విజయాలతో, ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకొని బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని ఆశిద్దాం. 2026 సమ్మర్‌కి విడుదల కానుంది.


