
📌 Key Points
- సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తోంది.
- సిద్ధు జొన్నలగడ్డ ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను ప్రశంసిస్తూ, ఇది ఒక అందమైన ప్రేమకథ అని కొనియాడారు.
- ప్రభాస్ కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు, యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలను ప్రత్యేకంగా అభినందించారు.
- దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఆధునిక సంబంధాలలోని సున్నితత్వాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది.
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ మెచ్చుకున్నారు. ఇది ఒక మంచి ప్రేమకథ అని ఆయన అన్నారు.
‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ
Siddhu Jonnalagadda: యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Shobhan), అందాల భామ మానస వారణాసి (Manasa Varanas) జంటగా నటించిన తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. సంక్రాంతి సినిమాల తర్వాత మళ్లీ ఈ చిత్రమే ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద వినిపిస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు క్లీన్ ఎంటర్‌టైనర్ అంటూ ప్రశంసలు కురిపిస్తుండగా.. తాజాగా టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Star Boy Siddu Jonnalagadda) ఈ చిత్రంపై తన స్పందనను తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా సినిమాను ప్రశంసించిన సిద్ధు.. ‘కపుల్ ఫ్రెండ్లీ’ మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథ అని, ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతోందని పేర్కొన్నారు. హీరో సంతోష్ శోభన్ పెర్ఫార్మెన్స్‌తో పాటు హీరోయిన్ మానస వారణాసి, చిత్ర బృందం మొత్తానికి సిద్ధు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన పోస్ట్.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సిద్ధు వంటి యూత్ ఐకాన్ నుంచి ప్రశంసలు దక్కడంతో చిత్రయూనిట్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. అంతకు ముందు ఈ సినిమాపై రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
నిర్మాణ విలువల పరంగా చూస్తే.. ఎక్కడా తగ్గకుండా, యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాకు దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో ప్రధాన హైలెట్‌గా నిలుస్తోంది. ఆధునిక సంబంధాల్లో ఉండే సున్నితమైన అంశాలను, హాస్యాన్ని జోడించి అశ్విన్ తెరకెక్కించిన విధానం ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తోంది. ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కంటెంట్ మీద నమ్మకంతో సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో.. ధీరజ్ వ్యూహం పక్కాగా ఫలించిందని ట్రేడ్ వర్గాలు సైతం విశ్లేషిస్తున్నాయి.
సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసలు
ఇక బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే, కేవలం టాక్‌తోనే కాకుండా.. కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా సత్తా చాటుతోంది. భారీ పోటీ ఉన్నప్పటికీ, మౌత్ టాక్ సానుకూలంగా ఉండటంతో కలెక్షన్స్ నిలకడగా కొనసాగుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3.96 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా తెలుపుతూ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో ఈ సినిమాకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. సంతోష్ శోభన్ కెరీర్‌లో ఇది మరో మంచి సక్సెస్‌గా నిలవడమే కాకుండా, హీరోయిన్ మానస వారణాసికి టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు.
Happy to see #CoupleFriendly connect with hearts ❤️
సినిమా నిర్మాణ విలువలు, సాంకేతిక అంశాలు
Congrats to @santoshsoban , @varanasi_manasa and the whole team for making a film that feels warm and real 🤗 @manojac #AjayKumarRaju @UV_Creations @DheeMogilineni @dheerajcinemas
— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) February 16, 2026
మొత్తానికి, ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా యూత్‌ను ఆకట్టుకుంటోంది. సిద్ధు జొన్నలగడ్డ వంటి స్టార్స్ ప్రశంసలు సినిమాకు మరింత ప్లస్ అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఇది నిలదొక్కుకుంటుందా చూడాలి.


