|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శింబు లవ్ స్టోరీ: పెళ్లి ఎప్పుడు? ఎవరితోనో?

Published: 03-02-2026, 12:35 AM
శింబు లవ్ స్టోరీ: పెళ్లి ఎప్పుడు? ఎవరితోనో?
  • శింబు, నయనతార 2006లో ‘వల్లవన్’ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు, ఫోటోలు లీక్ అయ్యాక విడిపోయారు.
  • హన్సికతో శింబు ప్రేమాయణం నడిపాడు, పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి, కానీ ఆ బంధం కూడా నిలవలేదు.
  • త్రిషతో కూడా శింబు ఎఫైర్ నడిపాడని పుకార్లు వచ్చాయి, కానీ వారిద్దరూ ఎప్పుడూ దీని గురించి ధృవీకరించలేదు.
  • ప్రభాస్ లాగే శింబు కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా కోలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నాడు.

కోలీవుడ్ స్టార్ హీరో శింబు పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రేమ వ్యవహారాలు మరోసారి తెరపైకి వచ్చాయి. నయనతార, హన్సిక, త్రిష వంటి హీరోయిన్లతో ఆయన ఎఫైర్ల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

నయనతారతో ప్రేమ, బ్రేకప్

HBD Simbu:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శింబు (Simbu)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఈయన అసలు పేరు సిలంబరసన్ టీఆర్. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన పుట్టినరోజు ఈరోజు.. ఈ సందర్భంగా ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ ఎలా అయితే పేరు దక్కించుకున్నారో.. అటు కోలీవుడ్ ఇండస్ట్రీలో శింబు కూడా అలాగే పేరు దక్కించుకున్నారు.. నిజానికి ప్రభాస్ ఒకరిద్దరితో ఎఫైర్ లో ఉన్నట్లు వార్తలు వినిపించినా.. ఇక్కడ శింబు మాత్రం చాలా మంది హీరోయిన్లతో ఫైర్ కొనసాగించారనే వార్తలు ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ ఎఫైర్ రూమర్స్ ని శింబు తండ్రి కూడా హన్సిక విషయంలో అంగీకరించిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈరోజు శింబు 42వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో మొదటిగా శింబు ప్రేమాయణం

2006లో ‘వల్లవన్’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రముఖ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara)తో ప్రేమలో పడ్డారు. అదే సమయంలో డేటింగ్ కూడా చేశారు. కానీ కొన్ని ప్రైవేట్ ఫోటోలు లీక్ అవడంతో వారి సంబంధం కాస్త బహిరంగంగా ధృవీకరించబడింది. అయితే కొన్నాళ్లకు వీరిద్దరూ విడిపోయారు. అటు నయనతార ప్రభుదేవాతో రిలేషన్ కొనసాగించి.. అతడికి బ్రేకప్ చెప్పేసి డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసి.. ఇద్దరు మగ కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది. ప్రస్తుతం తన కుటుంబంతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.

హన్సికతో పెళ్లి వార్తలు, ఆ తర్వాత విడాకులు

అయితే శింబు మాత్రం ఆ తర్వాత కాలంలో ‘వాలు’ అనే సినిమా సమయంలో హన్సిక మోత్వానీ తో ప్రేమలో పడ్డారు 2014 సమయంలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ కొంత కాలానికి ఇద్దరు విడిపోయారు. హన్సిక తన స్నేహితురాలి మాజీ భర్త సోహెల్ కతూరియా తో 2022లో ఏడడుగులు వేసింది.

ఆ తరువాత ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తో కూడా ఈయన ఎఫైర్ నడిపించాడనే రూమర్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కానీ వీరిద్దరూ ఎక్కడా కూడా తమ బంధాన్ని ధ్రువీకరించలేదు. ఆ తర్వాత త్రిష కృష్ణన్ విజయ్ దళపతితో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వినిపించాయి. కానీ అవి కూడా ఊహాగానాలు గానే మిగిలిపోయాయి. ఇక త్రిష మధ్యలో ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకుంది. కానీ దానిని కూడా బ్రేకప్ చేసుకుంది.

త్రిషతో ఎఫైర్ రూమర్స్

దీనికి తోడు ప్రముఖ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) తో కూడా ఈయన రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అలాగే ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) పేరు కూడా తెరపై వినిపించింది. దీనికి తోడు ఇటీవల నిధి అగర్వాల్ (Niddhi agerwal) తో కూడా ఈయన రిలేషన్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చినా ఎక్కడ ఇవి నిజం కాలేదు.

ఇక ఇప్పుడు 42 సంవత్సరాలు పూర్తయినా.. కనీసం ఇప్పటికైనా వివాహం చేసుకుంటారని అభిమానులు ఆసక్తిగా చూపిస్తున్నారు.. మరి చూద్దాం ఈ కొత్త ఏడాదైనా శింబు వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారేమో.

శింబు వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.