
📌 Key Points
- మంగ్లీ కేసులో ఊహించని ట్విస్ట్: అడ్వకేట్ సుబ్బారావుకు షాక్ ఇచ్చిన మధు స్టేట్మెంట్!
- హేమాకాంత్ రెడ్డి అసలు మోసగాడని మధు ఆరోపణ.. రూ. 20 కోట్లు కొట్టేసిన వైనం!
- సుబ్బారావు బిగ్ బాస్ కోసం చేసిన ప్రయత్నాలు.. సినీ సెలబ్రిటీల ఫోన్ నంబర్ల కోసం ఆరా!
- బాధితులు వేరైతే.. తెరపైకి వచ్చింది మరొకరని మధు సంచలన ఆరోపణలు!
సింగర్ మంగ్లీ పేరు ఇప్పుడు మారుమోగుతోంది! ఆమె చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి. తాజాగా అడ్వకేట్ సుబ్బారావుతో ఉన్న కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా?
మధు సంచలన ఆరోపణలు.. హేమాకాంత్ రెడ్డి అసలు మోసం
Singer Mangli :ప్రముఖ సింగర్ మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో అప్రూవర్ గా మారిన మధు.. కీలక వ్యాఖ్యలు చేశారు. సింగర్ మంగ్లీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హేమాకాంత్ రెడ్డి తనను మోసం చేశాడని చెప్పుకొచ్చాడు. కంపెనీలో పెట్టిన సుమారు రూ.20 కోట్లను హేమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని ఆరోపించాడు. అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డి ఇద్దరు స్నేహితులని వెల్లడించారు.
అంతేకాక తనకు సుబ్బారావే.. హేమాకాంత్ రెడ్డిని పరిచయం చేశాడని మధు చెప్పుకొచ్చాడు. హేమాకాంత్ రెడ్డి తన డబ్బులు తీసుకున్నాడని.. దీని గురించి తెలుసుకున్న సుబ్బారావు.. తన డబ్బులను తిరిగి ఇప్పిస్తానని చెప్పాడని వెల్లడించాడు. సినీ సెలబ్రిటీల ఫోన్ నంబర్లు కావాలని సుబ్బారావు తనని అడిగాడని.. అతడికి బిగ్ బాస్ లోకి వెళ్లాలని చాలా ఆశ అని.. అందుకు అనేక ప్రయత్నాలు చేశాడని చెప్పుకొచ్చాడు. ఈ కేసులో అసలైన బాధితులు కాకుండా.. వేరేవాళ్లు తెరపైకి వస్తున్నారని మధు ఆరోపించారు.
సుబ్బారావు బిగ్ బాస్ ప్రయత్నాలు.. సినీ నంబర్ల కోసం ఆరా
ఇదిలా ఉంటే ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో రామావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరిపై నల్లగొండ, గద్వాల్ లో 62 కేసులు నమోదయ్యాయి. మధు అండ్ గ్యాంగ్ సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో అమాయక జనాల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ మొత్తంతో పరారయ్యారు. ఈ గ్యాంగ్ పై నమోదైన మైక్రో ఫైనాన్స్ కేసును సీఐడీ బృందం పర్యవేక్షిస్తోంది. సీఐడీ పోలీసులు మధు గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే మధు అప్రూవర్ గా మారడం ఆసక్తికరంగా మారింది.
అసలైన బాధితులు వేరంటూ మధు సంచలన వ్యాఖ్యలు
సింగర్ మంగ్లీ ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి మంగ్లీ, ఆమె తమ్ముడు శివ, తన స్నేహితులు మధు, భరత్ చౌహన్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీరంతా కలిసి.. గోకుల నందన అనే ఇన్ఫ్రా సంస్థలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి సుమారు 150 మందికి పైగా అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మోసం విలువ సుమారు రూ. 200 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఫిర్యాదులో చెప్పారు. పెట్టుబడుల పేరుతో మంగ్లీ 100 మందిని పైగా మోసం చేయడమే కాక తనను బెదిరించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు సుబ్బారావు. అయితే అతడి ఆరోపణలను మంగ్లీ కొట్టి పారేశారు.
మంగ్లీ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. మధు చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


