
📌 Key Points
- మైక్రో ఫైనాన్స్ వ్యాపారానికి నాకు సంబంధం లేదని స్పష్టం చేసిన సింగర్ మంగ్లీ.
- ఈవెంట్ ఆహ్వానాల వరకే పరిమితం, వ్యక్తిగత వ్యాపారాలతో సంబంధం లేదని ప్రకటన.
- కొందరు కావాలనే తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన.
- తన పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మవద్దని విజ్ఞప్తి, బాధితులకు న్యాయం చేయాలని పోలీసులకు వినతి.
సింగర్ మంగ్లీ పేరుతో జరుగుతున్న మోసాలపై ఆమె స్వయంగా స్పందించారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో తన పేరును వాడుకుంటున్నారని, దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
మైక్రో ఫైనాన్స్ వివాదంపై మంగ్లీ క్లారిటీ
Singer Mangli : మైక్రో ఫైనాన్స్ పేరిట తన పేరుతో కొందరు డబ్బులు వసూలు చేశారని వస్తున్న వార్తలను సింగర్ మంగ్లీ ఖండించారు. ఫైనాన్స్ వ్యాపారులకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రొఫెనల్ ఈవెంట్‌కు సంబంధించిన ఇన్విటేషన్ వివరాల వరకే గాని, వాళ్ల పర్సనల్ వ్యాపారాల గురించి తనకు, తన కుటుంబ సభ్యులకు ఏ మాత్రం తెలియవన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు.
మైక్రోఫైనాన్స్ పేరిట నా పేరుతో కొందరు డబ్బులు వసూలు చేశారని వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. నాకు ఆ వ్యక్తులకు, వాళ్లకు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాలకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం నన్ను, నా తమ్ముడిని రోజు చాలా మంది సంప్రదిస్తుంటారు. ఆ ఈవెంట్‌కు సంబంధించిన ఇన్విటేషన్ వివరాల వరకే గాని, వాళ్ల పర్సనల్ వ్యాపారాల గురించి నాకు, నా కుటుంబ సభ్యులకు ఏ మాత్రం సంబంధం లేని విషయం.
వ్యాపారాలతో తనకు సంబంధం లేదని స్పష్టీకరణ
ఇలాంటి మోసపూరిత విషయాల్లో నా పేరును వాడుకోవడం, నన్ను ఇవ్వాల్వ్ చేయడం చాలా అన్యాయం. కావాలని కొందరు నా వ్యక్తిగత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కరెన్సీకి సంబంధించిన వీడియోలకు, మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు.
పోలీసులకు విజ్ఞప్తి చేసిన సింగర్
నా ప్రొఫెషన్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మవద్దు. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను కోరుతున్నాను. అని మంగ్లీ తెలిపింది.
మంగ్లీ ప్రకటన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే అన్ని వివరాలు మీ ముందుకు వస్తాయి.


