|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంగ్లీ జీవితంలో సంచలనాలు! జానపదం నుండి వివాదాల వరకు ఆమె ప్రయాణం!

Published: 13-04-2026, 10:05 PM
మంగ్లీ జీవితంలో సంచలనాలు! జానపదం నుండి వివాదాల వరకు ఆమె ప్రయాణం!
  • సింగర్ మంగ్లీ జానపద గీతాలతో కెరీర్ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.
  • మంగ్లీ పెట్టుబడుల పేరుతో 150 కోట్ల రూపాయలు మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి.
  • బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగించారనే ఆరోపణలపై పోలీసులు దాడి చేశారు.
  • మంగ్లీ తనపై వస్తున్న ఆరోపణలతో తనకు సంబంధం లేదని చెబుతున్నారు.

ప్రముఖ సింగర్ మంగ్లీ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమెపై పెట్టుబడుల పేరుతో భారీ మోసం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే, బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మంగ్లీ ప్రస్థానం: జానపదం నుంచి అంతర్జాతీయ స్థాయికి

Mangli : సింగర్​ మంగ్లీ…పరిచయం అక్కర్లేని పేరు. జానపద గీతాలు పాడటంతో మొదలు పెట్టి స్వల్ప కాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన స్టార్​. అయితే, కొంతకాలంగా ఆమె వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నెటిజన్ల ట్రోలింగ్​ కు టార్గెట్​ గా మారుతున్నారు. తాజాగా పెట్టుబడుల పేర నూటా యాభై మందికి నుంచి నూటా యాభై కోట్లకు పైగా డబ్బు తీసుకుని మోసం చేసినట్టుగా ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తనకెలాంటి సంబంధం లేదని మంగ్లీ చెబుతున్నా నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మంగ్లీ పుట్టింది ఎక్కడంటే

వివాదాల్లో మంగ్లీ: ఆరోపణలు, ట్రోలింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి తాండాకు చెందిన మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్​. నెల్లూరు దగ్గరలోని జీనిగల తాండాలో పెరిగిన ఆమె రూరల్ డెవలప్​ మెంట్​ ట్రస్ట్​ సహకారంతో 10వ తరగతి పూర్తి చేశారు. ఆ తరువాత తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో కర్ణాటిక్ మ్యూజిక్ లో డిప్లొమా చదివారు. ఆ తరువాత హైదరాబాద్ వచ్చి జానపద గీతాలు పాడి కొంత గుర్తింపును పొందారు. అయితే, ఓ ఛానల్ లో ప్రసాదరమైన మాటకారి మంగ్లీ కార్యక్రమంలో ఆమె ఒక్కసారిగా పాపులర్​ అయ్యారు. తీన్మార్​ మంగ్లీ కార్యక్రమంలో ఆమె యాస చూసి అంతా తెలంగాణ బిడ్డ అని అనుకున్నారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ సినీ అవకాశాలు సాధించుకున్న మంగ్లీ ప్రస్తుతం స్టార్​ స్థాయికి ఎదిగారు. అమెరికాలో జరిగే అటా, తానా వేడుకల్లో ఆమె పాటలు పాడటం తప్పనిసరిగా మారింది. బర్త్ డే పార్టీ వివాదం… గత ఏడాది మంగ్లీ తన పుట్టిన రోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఊర్లపల్లిలో ఉన్న త్రిపుర రిసార్ట్​ లో పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో విదేశీ మద్యంతోపాటు డ్రగ్స్ వినియోగిస్తున్నారని…చెవులు చిల్లులు పడేలా డీజేలు మోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో పార్టీలో పది మంది మహిళలతోపాటు పన్నెండు మంది పురుషులు దొరికారు. వీరికి డ్రగ్ టెస్టులు జరుపగా ఒక్క దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి పాజిటీవ్ వచ్చింది. అయితే, విచారణలో తాను బర్త్ డే పార్టీలో గంజాయి సేవించ లేదని, అంతకు ముందే మరో చోట తీసుకున్నా అని దామోదర్ రెడ్డి చెప్పాడు. అయితే, అనుమతులు తీసుకోకుండా మద్యం పార్టీ నిర్వహించటం, డీజేలు మోగించటంపై పర్మిషన్​ తీసుకోకపోవటంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో ఓ వీడియో విడుదల చేసిన మంగ్లీ తన బర్త్ డే పార్టీలో ఎలాంటి మాదక ద్రవ్యాలు, విదేశీ మద్యం వినియోగం జరగలేదన్నారు. లోకల్ లిక్కర్ పార్టీకి పర్మిషన్​ తీసుకోవాలన్న విషయం తనకు తెలియదని చెప్పారు. తెలిసి ఉంటే తీసుకునే దాన్నని వివరణ ఇచ్చుకున్నారు.

బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం: పోలీసుల దాడి

మొత్తానికి మంగ్లీ తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ వివాదాల ప్రభావం ఆమె కెరీర్ పై ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. పూర్తి వివరాల కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.