|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరుత బ్యూటీకి నెలకు 30 లక్షలు: నేహా శర్మ కొత్త దందా వెనుక అసలు నిజం!

Published: 30-04-2026, 8:51 PM
చిరుత బ్యూటీకి నెలకు 30 లక్షలు: నేహా శర్మ కొత్త దందా వెనుక అసలు నిజం!
  • నేహా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌కు సబ్‌స్క్రిప్షన్లు వసూలు చేస్తోంది.
  • నెలకు సుమారు 30 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు అంచనా.
  • ఆమె తండ్రి ప్రముఖ రాజకీయ నాయకుడు, కాబట్టి ఆర్థిక సమస్యలు లేవు.
  • ఈ చర్యపై కొందరు మద్దతు ఇవ్వగా, మరికొందరు విమర్శిస్తున్నారు.

నటి నేహా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారనే వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈ ‘కొత్త దందా’పై నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. ‘చిరుత’ బ్యూటీ డబ్బు కోసం ఇలాంటి పనులు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సబ్‌స్క్రిప్షన్ల ద్వారా భారీ ఆదాయం

Neha Sharma: ఇన్‌స్టాగ్రామ్‌లో అందాలు ఆరబోయడం.. సబ్ స్క్రిప్షన్స్ పేరుతో లక్షల్లో వసూల్ చేయడం ఇపుడు బాగా ట్రెండ్ అయిపొయింది. మొన్నటికి మొన్న విష్ణు ప్రియ ఇలానే హాట్ ఫోటోలు, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి అంటూ లక్షల్లో లాగేసిందంటూ పలువురు మీడియాకి ఎక్కారు కూడా. ఇక తాజాగా ఇదే బిజినెస్ మొదలెట్టేసిందట చిరుత పిల్ల నేహ శర్మ.

యస్.. రామ్ చరణ్  డెబ్యూ హీరోగా సెప్టెంబర్ 28, 2007న విడుదలైన చిరుతలో  హీరోయిన్ గా నటించిన నేహ శర్మని ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 21 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇంతటి హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న నేహ తన పర్సనల్ మరియు ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కావాలంటే 299 చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటూ అనౌన్స్ చేసిందన్న వార్తలు ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయ్. ఇక ఈ అమ్మడు మొదలెట్టిన ఈ కొత్త దందాలో ఇప్పటికే 10 వేలకు పైగా సబ్‌స్క్రిప్షన్ తీసుకుని జాయిన్ కావడం గమనార్హం. ఈ లెక్కన కేవలం ఈ సబ్‌స్క్రిప్షన్ల ద్వారానే ఆమె నెలకు సుమారు 30 లక్షలు వెనకేస్తుందన్న మాట.

బికారి అనుకుంటే తప్పులో కాలేసినట్టే

తండ్రి రాజకీయ నాయకుడు: ఆర్థిక సమస్యలు లేకున్నా ఎందుకు?

అయితే ఇలా అందాల ఆరబోతతో లక్షలు గడిస్తున్న నేహ బికారి అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అవును.. ఆమె తండ్రి అజిత్ శర్మ బీహార్‌లో ఫేమస్ పొలిటీషియన్. మరి ఫైనాన్షియల్ గా సాలిడ్ గా ఉండి కూడా ఇలా పెయిడ్ కంటెంట్ వైపు ఎందుకు మొగ్గు చూపోతుందో ఎ అమ్మడికే తెలియాలి.అయితే కొంతమంది ఇది పర్సనల్ విషయం, నచ్చినోల్లు సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారు.. నచ్చని వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు అని కొందరు సపోర్ట్ చేస్తుంటే, ఒక సెలెబ్రిటీ అయి ఉండి సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది, అసలు డబ్బులు సంపాదించాలంటే ఇలాంటి బరి తెగించిన పనులు చేయల్సిందేనా అంటూ నేహాని ఏకి పారేస్తున్నారు మరికొంత మంది నెటిజన్లు.

చిరుత పిల్ల ఎలా రియాక్ట్ అవుతుందో

నేహ శర్మ సినీ విశేషాలకొస్తే.. ‘’చిరుత’,కుర్రాడు’ సినిమాల తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయిన నేహ ‘క్రూక్’ (Crook-2010), ‘క్యా సూపర్ కూల్ హై హమ్(Kyaa Super Kool Hain Hum- 2012), ‘యంగ్ ఇస్తాన్ (Youngistaan-2014) వంటి సినిమాలతో మెప్పించింది. ఇక చివరిగా 2023లో ‘జోగిరా సారా రా రా’ (Jogira Sara Ra Ra)సినిమాలో నటించినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

నేహా శర్మ చర్యపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు

మరి సినిమాలు తక్కువయ్యాయనేమో ఇప్పుడిలా సబ్ స్క్రిప్షన్స్ పేరుతో లక్షలు వసూల్ చేస్తుంది. అయితే చిన్న చిన్న పాత్రల్లో కనిపించే తారలు అడపా దడపా ఈ బాట పడుతున్నప్పటికీ ఒక మెయిన్ స్ట్రీమ్ హీరోయినే ఇలా సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లోకి రావడం నెట్టింట్లో హాట్ టాపిక్ అయిపొయింది. చూడాలి మరి ఈ కాంట్రవర్సీపై  చిరుత పిల్ల ఎలా రియాక్ట్ అవుతుందో !

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

నేహా శర్మ చేపట్టిన ఈ పెయిడ్ కంటెంట్ ట్రెండ్ ఆమెకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నప్పటికీ, ఆమె చర్య సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుందనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఈ వివాదంపై ఆమె ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.