
📌 Key Points
- సింగర్ మంగ్లీ మరియు ఆమె సోదరుడిపై పెట్టుబడుల పేరుతో మోసం చేసినట్లు కేసు నమోదు.
- సుమారు 100 మంది నుండి భారీగా నిధులు సేకరించి మోసం చేశారని ఆరోపణలు.
- న్యాయవాది సుబ్బారావు బాధితుల తరపున డబ్బులు కోరగా మంగ్లీ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు.
- మంగ్లీ, శివ, వేణు కలిసి లాయర్‌ను చంపేస్తామని బెదిరించారని ఆరోపణ.
ప్రముఖ సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేసిందని, అలాగే న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి.
మంగ్లీపై కేసు నమోదుకు కారణం ఏమిటి?
Singer Mangli : తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. తన హస్కీ వాయిస్ తో ఎన్నో పాటలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది మంగ్లీ. పాటలతో బాగా ఫేమస్ అయిన ఈమె ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ఓ బూతు పాట పాడింది అంటూ వార్తలు వినిపించాయి. దాంతో మరోసారి ఆమె పేరు హైలెట్ అయింది. ఇప్పుడు తాజాగా సింగర్ మంగ్లీ పై హైదరాబాద్ పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది ఎందుకు ఆమెపై కేసు నమోదు అయింది అన్న వివరాలను కాస్త వివరంగా తెలుసుకుందాం..
తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీ పై తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. మంగ్లీ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. పెట్టుబడుల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేయడం, అలాగే న్యాయవాదిని బెదిరించడం వంటి ఆరోపణలపై ఆమెపై కేసు నమోదవడంతో ఇది ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.. నిజానికి మంగ్లీ, ఆమె సోదరుడు శివ తో పాటుగా మరి కొంతమంది కలిసి 100 మంది నుంచి భారీ మొత్తంలో నిధులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మించి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు అని వారిపై చీటింగ్ కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. వారి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీస్ లు ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసు కనుక నిరూపణ అయితే మంగ్లీని ఆమె తమ్ముడ్ని అరెస్టు చేస్తారు అన్నది ప్రస్తుతం హాట్టాపిక్ గా మారింది..
పెట్టుబడుల పేరుతో మోసం ఆరోపణలు
న్యాయవాదికి బెదిరింపులు.. అసలేం జరిగింది?
బాధితుల నుంచి వివరాలను సేకరించిన లాయర్ సుబ్బారావు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడంతో మరింత తీవ్రంగా మారిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాధితుల నుంచి తీసుకున్న మొత్తం డబ్బులను ఇవ్వాలని లాయర్ కోరగా మంగ్లీ ఆమె అనుచరులు బెదిరింపులకు దిగినట్లు వాళ్లు ఆరోపిస్తూ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.. మంగ్లీ, శివ, వేణు ఊడుగుల కలిసి ఫోన్ ద్వారా తీవ్రంగా బెదిరించారని, తనను యాక్సిడెంట్ చేయించి చంపేస్తామని హెచ్చరించారని న్యాయవాది ఆరోపించారు. వీరి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరుస హిట్ పాటలతో కెరీర్‌లో దూసుకుపోతున్న మంగ్లీపై ఈ తరహా ఆరోపణలు రావడం సినీ, సంగీత రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈమధ్య ఈమె వరస వివాదాల్లో చిక్కుకోవడం కామన్ అయిపోయింది. మరి ఈ కేసు పై ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.. ఏది ఏమైన ఈ కేసులో ఆమె అరెస్ట్ తప్పదా అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి..
ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. మంగ్లీ మరియు ఆమె సోదరుడు దోషులుగా తేలితే అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ సంఘటన సినీ, సంగీత రంగాలలో కలకలం రేపుతోంది.


