|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంగ్లీకి మరో షాక్! ‘ఆ పాట’తో కొత్త రచ్చ.. తెలంగాణ ఆగ్రహం!

Published: 02-06-2026, 5:00 PM
మంగ్లీకి మరో షాక్! 'ఆ పాట'తో కొత్త రచ్చ.. తెలంగాణ ఆగ్రహం!
  • సంచలన సింగర్ మంగ్లీకి మరో షాక్! పాత వీడియో వైరల్, నెటిజన్స్ ఆగ్రహం.
  • తెలంగాణ సాయుధ పోరాట పాటను అగౌరవపరిచారని మంగ్లీపై తీవ్ర విమర్శలు.
  • ‘బండెనుక బండి గట్టి’ పాటపై మంగ్లీ డ్యాన్స్, గంతులపై మండిపాటు.
  • తెలంగాణ సమాజానికి మంగ్లీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్.

వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న సంచలన సింగర్ మంగ్లీకి మరో పెద్ద తలనొప్పి వచ్చిపడింది. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని నింపిన ఓ పాటను ఆమె అగౌరవపరిచారంటూ నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సరికొత్త రచ్చతో టాలీవుడ్ షాక్! పూర్తి వివరాలు చూద్దాం.

మంగ్లీని వెంటాడుతున్న పాత వివాదాలు!

ఇటీవల వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సింగర్ మంగ్లీ మెడకు మరో వివాదం చుట్టుకుంటోంది. ఫామ్ హౌసులో డ్రగ్స్ పార్టీ, అధిక వడ్డీ పేరుతో చేసిన ఘరానా మోసాల వంటి కేసుల విషయాల్లో వార్తల్లో నిలిచినా ఈ జానపద గాయని మంగ్లీపై సోషల్ మీడియాలో మరో ఇష్యూ లేవదీశారు నెటిజన్స్. అయితే కొద్దికాలం క్రితం ఓ కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపిన మా భూమి సినిమాలని “బండెనుక బండి గట్టి.. పదహారు బండ్లు గట్టి” అనే పాట పాడారు. అయితే అప్పట్లో నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా గూడ అంజయ్య రాసిన ఈ పాట ప్రజల నాల్కలపై నానింది. ఈ పాట వెనకాల ఉన్న పెయిన్, ఎమోషన్ అర్థం చేసుకోకుండా పార్టీల్లో, పబ్బుల్లో పాడినట్టు, డ్యాన్స్ చేస్తూ మంగ్లీ ఈ పాట పాడటంపై మరోసారి విరుచుకు పడుతున్నారు నెటిజన్స్. ఆ గంతులు ఏంటీ? ఆ పాడటం ఏంటని మండిపడుతున్నారు. ఈ కార్యక్రమం గతంలో జరిగినదే అయినప్పటికీ.. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మరోసారి తెర మీదికి వచ్చి రచ్చకు ఎక్కింది. తక్షణమే మంగ్లీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

‘ఆ పాట’పై ఆగ్రహం.. నెటిజన్స్ ఫైర్!

క్షమాపణ చెప్పాలని డిమాండ్! రచ్చ రచ్చ!

మొత్తానికి మంగ్లీపై ఈ కొత్త వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రజల ఆగ్రహం చల్లారాలంటే ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ సంచలన అంశంపై మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.